సెప్టెంబర్ 13 ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే

0
2421

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు మరో శుభవార్త అని చెప్పొచ్చు.  ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ నెల 13 ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో పండగే అని చెప్పాలి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.

ఈ నెల 23 న సినిమా ఆడియో ని డైరెక్ట్ గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉండగా ఈ నెల 13 న సినిమా మరో అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. వినాయక చవితి కానుకగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారట.

ఎన్టీఆర్ పుట్టినరోజున మాస్ లుక్ ని రివీల్ చేయగా టీసర్ లో కూడా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. కాగా ఇప్పుడు 13 న క్లాస్ కి నచ్చేలా త్రివిక్రమ్ స్టైల్ లో ఓ న్యూ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here