తమిళ్ గడ్డపై 200…కెరీర్ లో రికార్డ్

0
1606

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై అంచనాలు ఆకాశాన్ని అంటగా సినిమా అన్ని ఏరియాల్లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తమిళనాడు లో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది…ఈ మధ్యకాలంలో తమిళ్ లో డైరెక్ట్ తెలుగు వర్షన్ తో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయిన నాన్ బాహుబలి మూవీస్ లో నంబర్ 2 గా నిలిచింది ఈ సినిమా.

భరత్ అనే నేను సినిమా ఇక్కడ 220 థియేటర్స్ లో రిలీజ్ కాగా ఇప్పుడు అరవింద సమేత సినిమా సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!