తెలుగు పాత్ బ్రేకింగ్ మూవీ అర్జున్ రెడ్డి ఇక్కడ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో హిందీ లో రీమేక్ అయిన కబీర్ సింగ్ కూడా అలానే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది… కానీ మధ్యలో తమిళ్ లో కూడా రీమేక్ అయిన సినిమా పరిస్థితి మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది, టాలెంటెడ్ డైరెక్టర్ బాలా డైరెక్షన్ లో విక్రం తనయుడు ధృవ్ విక్రమ్ ని లాంచ్ చేయడానికి ఈ రీమేక్ ని….
ఎంచుకోగా… బాలా డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ “వర్మ”…. చాలా మార్పులతో తెరకెక్కడంతో ఆ వర్షన్ చూసిన విక్రమ్ ఎందుకో తేడా కొడుతుంది అని సినిమా టోటల్ కంప్లీట్ అయినా కానీ ఆ వర్షన్ నే వద్దు అని చెప్పాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు ఆ టైం లో…
తర్వాత వేరే డైరెక్టర్ తో మళ్ళీ అర్జున్ రెడ్డి వర్షన్ ఎలా ఉందో అలానే రీమేక్ చేసి రిలీజ్ చేయగా రిజల్ట్ కూడా ఫ్లాఫ్ గానే మిగిలి పోయింది. కానీ బాలా తెరకెక్కించిన వర్మ సినిమా ఎందుకని ఆపేశారు, అంతలా ఏం తేడా కొట్టింది అని తెలుసుకోవాలని అందరికీ ఉండగా….
చాలా టైం తర్వాత ఎట్టకేలకు బాలా డైరెక్షన్ లో వచ్చిన వర్మ సినిమా ను ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు… సినిమాను 6 వ తేదీన సింప్లీ సౌత్ అనే యాప్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతుండగా ఈ యాప్ కి ఇండియా లో యాక్సస్ లేదట… కేవలం ఓవర్సీస్ లోనే పని చేసే ఈ యాప్ లో…
ఈ సినిమా ను టెలికాస్ట్ చేయడానికి సుమారు 2.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించారని, తర్వాత వ్యూస్ ని బట్టి రేటు మరింత పెంచే అవకాశం ఉంటుందని సమాచారం. అసలు ఏమాత్రం బాలేదు అని వదిలేసిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కానున్న వేల బాల ఎలా తెరకెక్కించాడు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు….