Home న్యూస్ వద్దని ఆపేసిన అర్జున్ రెడ్డి రీమేక్…వర్మా రివ్యూ…ఇందుకే ఆపేశారు సినిమా!

వద్దని ఆపేసిన అర్జున్ రెడ్డి రీమేక్…వర్మా రివ్యూ…ఇందుకే ఆపేశారు సినిమా!

0

ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ అంటే… ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఉండాలి, అందునా ఒక పాత్ బ్రేకింగ్ మూవీ రీమేక్ చేసే సమయం లో మరింత శ్రద్ధ తీసుకోవాలి… మన వాళ్ళు కూడా కొన్ని రీమేక్ ని చెడగొట్టారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్షన్ 1 ని డైరెక్ట్ చేసిన బాలా ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక అవుట్ పుట్ చూసి హీరో విక్రం తన కొడుకు లాంచ్ కి అర్జున్ రెడ్డి మంచి ప్రయత్నం అయినా అది రా రస్టిక్ తరహా మూవీస్ ఎక్కువగా చేసే బాలా డైరెక్షన్ లో రీమేక్ చేయడం వికటించింది అని వర్మా సినిమా….

మొత్తం కంప్లీట్ అయినా కానీ ఈ వర్షన్ వద్దే వద్దని చెప్పి మళ్ళీ అర్జున్ రెడ్డి ని ఉన్నది ఉన్నట్లు తీసి రిలీజ్ చేశారు, అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు… అది వేరే విషయం కానీ బాలా డైరెక్షన్ లో వచ్చిన వర్మా ఆగిపోవడం తో ఎందుకని ఆపారు… సినిమాలో అంతలా ఏం బ్యాడ్ గా ఉంది….

అన్న విషయాలు తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూడగా సినిమా ను రీసెంట్ గా సింప్లీ సౌత్ యాప్ వాళ్ళు ఇండియా లో 140 టికెట్ రేటు తో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయగా సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఆపేసి మంచి పని చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

3 గంటల లెంత్ ఉన్న ఒరిజినల్ నుండి ఎంతవరకు తీశారో తెలియదు కానీ 1 గంట 50 నిమిషాల లోనే సినిమా ముగుస్తుంది… ఒరిజినల్ లో హీరో ఫ్రెండ్ కి చాలా ముఖ్య పాత్ర ఉంటే ఇక్కడ ఈశ్వరి రావ్ కి ఆ పాత్ర ని మార్చారు. ఒక క్లాసిక్ మూవీ ఇక్కడ కమర్షియల్ మూవీ చేశారు.

సీన్ బై సీన్ ఎదో కమర్షియల్ సినిమా లో వచ్చి వెళుతున్నట్లు వస్తూ పోతూ ఉంటుంది, ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆడియన్స్ కి రిజిస్టర్ అవ్వదు, ఇక అరవ పైత్యం అంటారు చూశారు కొన్ని సీన్స్ లో అది పీక్స్ లో వెళుతుంది… అవి చూసి మరింత చిరాకు పుట్టక మానదు….

ఓవరాల్ గా అర్జున్ రెడ్డి మెయిన్ కథని అలానే ఉంచినా ఇక్కడ కమర్షియల్ గా మార్చి, మరో విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు కానీ అది దారుణంగా వికటించింది అని చెప్పాలి, ఒక్క ఈశ్వరి రావ్ రోల్ మాత్రం మెప్పించగా మిగిలిన అందరి రోల్స్ మినిమమ్ రిజిస్టర్ కూడా అవ్వవు..

ఇక తెలుగు లో సినిమా మరో రేంజ్ లో ఎలివేట్ అవ్వడానికి కారణం సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్… ఇక్కడ బ్యాగ్రౌండ్ స్కోర్ దారుణంగా ఫెయిల్ అయ్యింది, ఇక హీరో ఇంట్రో సీన్ అలాగే మందు తాగి ఆపెరేషన్ చేసే సీన్స్ లో పైత్యం మరో లెవల్ లో ఉండగా సోషల్ మీడియా లో ఆ వీడియో లు తెగ వైరల్ అవుతున్నాయి…

మొత్తం మీద బాలా ఇది వరకు డైరెక్ట్ చేసిన శివ పుత్రుడు, శేషు, వాడు వీడు లాంటి సినిమాలకు పూర్తీ విరుద్దం అయిన ఈ సినిమా ను ఎవరో బలవంతంగా ఆయనతో డైరెక్ట్ చేయించారా అనిపించేలా డైరెక్ట్ చేశారు.. సినిమా మొత్తం చూసిన తర్వాత విక్రం ఈ సినిమా ను ఆపేసి మంచి పనే చేశారు అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here