Home న్యూస్ 2 కోట్ల బిజినెస్ రేటు….బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల్లో వచ్చింది ఇది!

2 కోట్ల బిజినెస్ రేటు….బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల్లో వచ్చింది ఇది!

0

రాజా రాజ చోర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జునా ఫాల్గుణ… బాక్స్ ఆఫీస్ దగ్గర 2021 చివరి సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాను అసలు ఆడియన్స్ పట్టించుకోలేదు. సినిమా ఓపెన్ అయిన రోజున డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అంచనాలను అయితే అందుకునేలా అయితే కనిపించలేదు అనే చెప్పాలి.

సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 57 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగలిగింది. న్యూ ఇయర్ వీకెండ్ లోనే…

మ్యాజిక్ చేయలేక పోయిన ఈ సినిమా… బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. మొత్తం మీద మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా…

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 85 లక్షల దాకా షేర్ ని సాధించింది. కానీ సినిమా ని….

2 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు ట్రేడ్ లో సమాచారం ఉంది, ఆ లెక్కన 2.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ అవుతుంది, కానీ మొత్తం మీద మొదటి వారం తర్వాత సినిమా క్లీన్ హిట్ అవ్వడానికి ఇంకా 1.35 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా చాలా థియేటర్స్ ని సినిమా కోల్పోయింది. దాంతో బ్లాక్ బస్టర్ తర్వాత భారీ డిసాస్టర్ శ్రీ విష్ణుకి సొంతం అయిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here