రీసెంట్ గా రాజా రాజా చోర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ అర్జున ఫాల్గుణ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది, టీసర్ ట్రైలర్ తో కొంచం ప్రామిసింగ్ గా అనిపించిన సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతవరకు ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం పదండీ….. ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే గోదావరి జిల్లలో ఉద్యోగం ఏమి చేయకుండా స్నేహితులతో ఉండే హీరో….
అరకు నుండి గంజాయిని స్మగుల్ చేయాలని ప్లాన్ వేస్తారు… దాంతో పోలీసులు వీళ్ళని పట్టుకోవాలని చూస్తారు, తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ… అతి చిన్న స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కామెడీ సీన్స్, ఒకటి రెండు డైలాగ్స్ అండ్ సాంగ్స్ తప్పితే…
చాలా వరకు సన్నివేశాలు ఇల్లాజికల్ గా, కొంచం బోర్ గా అనిపిస్తాయి, ఉన్నంతలో శ్రీ విష్ణు తన రోల్ వరకు బాగానే చేసినా కథలో అంతగా బలం లేకపోవడంతో పెద్దగా చేయడానికి ఏమి లేకపోయింది. గోదావరి వల్లే చందమామ సాంగ్ ఒక్కటి బాగా ఆకట్టుకోగా ఫ్రెండ్స్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించగా…
హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించుకుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండగా, ప్రొడక్షన్ వాల్యూస్ కొంచం నాసిరకంగానే ఉన్నాయని చెప్పాలి. డైరెక్టర్ చాలా సింపుల్ కథని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలనీ ట్రై చేశాడు కానీ అది కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితం అవ్వగా చాలా సీన్స్ పేలవంగా వచ్చాయి. మొత్తం మీద సినిమా కి వెళ్ళే ఆడియన్స్ కథని పట్టించుకోకుండా…
కొన్ని కామెడీ సీన్స్ ఒకటి రెండు పాటల కోసం కష్టపడి కూర్చుని చూడగలిగితే సినిమా ఓకే అనిపిస్తుంది…. ఓవరాల్ గా రాజా రాజా చోర రేంజ్ కి ఏమాత్రం తగ్గదు ఈ సినిమా అని థియేటర్స్ వెళితే మట్టుకు నిరాశ గట్టిగా ఉండటం ఖాయమని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.