బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో మీడియం రేంజ్ మూవీస్ కొన్ని రిలీజ్ కి ముందు పర్వాలేదు అనిపించే రేంజ్ అంచనాల నడుమ రిలీజ్ అయ్యాయి… వాటిలో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) ఒకటి కాగా…క్లైమాక్స్ మీద రిలీజ్ కి ముందు నుండి..
మంచి హైప్ నెలకొనడం…ఓవరాల్ గ రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్ ఒక్కటి తప్ప మిగిలిన సినిమా మొత్తం రెగ్యులర్ టెంప్లెట్ కమర్షియల్ మూవీ లానే ఉండటంతో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు సినిమా…
ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా మరోసారి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకోగా కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ కి అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కి మాత్రం…
మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ గా వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు ప్రైమ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 4 రోజులుగా సినిమా ప్రైమ్ వీడియో లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండగా….
బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ అనుకున్న రేంజ్ లో లేక పోయినా కూడా ఇక్కడ డిజిటల్ లో మాత్రం సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతూ మంచి రీచ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక టెలివిజన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.