Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ను దక్కించుకుని ఇప్పుడు కంబ్యాక్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)తో ఆడియన్స్ ముందుకు రాగా…

ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది…స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సిన్సియర్ పోలిస్ అయిన హీరో తల్లి తన కొడుకు కూడా తన లాగే సిన్సియర్ పోలిస్ అవ్వాలని కోరుకుంటుంది కానీ…

కొడుకు మాత్రం అనుకోని పరిస్థితులలో గుండగా మారతాడు…ఆ తర్వాత తల్లి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఏం జరిగింది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కూడా రీసెంట్ టైంలో తల్లి కొడుకుల ఎమోషనల్ కంటెంట్…

రాకపోవడంతో రొటీన్ గానే అనిపించినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ తో నిండిపోయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగగా కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగానే మెప్పించగా…

మంచి పాయింట్ తో ఇంటర్వల్ ఎపిసోడ్ సాలిడ్ గా వచ్చి సెకెండ్ ఆఫ్ పై అంచనాలను పెంచేసింది. ఇక సెకెండ్ ఆఫ్ లో హీరో విలన్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ ఒక వైపు మరో పక్క తల్లి కొడుకుల ఎమోషనల్ బాండింగ్ సీన్స్ తో నిండిపోయిన సినిమా…

యాక్షన్ పార్ట్ కూడా ఎక్స్ లెంట్ గా సాగడంతో ఓవరాల్ సినిమా ఎండ్ అయ్యే టైంకి సినిమా పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో ఎండ్ అవుతుంది. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ మొత్తం…

ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అని చెప్పాలి…మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా రెగ్యులర్ షోలకి…

మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద కళ్యాణ్ రామ్ లాస్ట్ 2 సినిమాల కన్నా బెటర్ గా ఉందంటున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇక ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here