Home న్యూస్ క్లైమాక్స్…క్లైమాక్స్….అదొక్కటే చెబుతే ఎలా!!

క్లైమాక్స్…క్లైమాక్స్….అదొక్కటే చెబుతే ఎలా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ క్రేజ్ ఉండగా రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే తెరకెక్కినా కూడా క్లైమాక్స్ సినిమాలో మేజర్ హైలెట్ అంటూ..

రిలీజ్ కి ముందు నుండే హైలెట్ చేశారు….దాంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కూడా సినిమా క్లైమాక్స్ మరో రేంజ్ లో ఉంటుంది అంటూ చెప్పడంతో సినిమా మొత్తం మీద ఉన్న ఆసక్తి కన్నా కూడా క్లైమాక్స్ పోర్షన్ మీద ఎక్కువ హైప్ నెలకొంది…

ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్ గా మూవీ రొటీన్ గానే సాగి, తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఆల్ మోస్ట్ క్లైమాక్స్ ముందు వరకు గెస్ చేయడం ఈజీగానే అనిపించగా…. క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటి మాత్రం డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కి కలిగించింది…

Arjun Son Of Vyjayanthi Movie 1st Day Total WW Collections!!!

దాంతో అప్పటి వరకు రొటీన్ గానే అనిపించిన సినిమా క్లైమాక్స్ కొంచం కొత్తగా ట్రై చేయడంతో సినిమా మీద కొంచం పాజిటివిటీ పెరిగింది అని చెప్పాలి…కానీ జనాలు మాత్రం ఈ క్లైమాక్స్ కోసం ఎగబడి వస్తారు అనుకున్నా కూడా ఆశించిన మేర రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాలేదు…

కానీ రీసెంట్ గా సినిమాకి జరిగిన సక్సెస్ మీట్స్ లో క్లైమాక్స్…క్లైమాక్స్ అంటూ ఒక్క క్లైమాక్స్ గురించి మాత్రమే చెప్పగా పోస్టర్స్ లో కూడా క్లైమాక్స్ ని హైలెట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు, ఆ ఒక్క సీన్ తోనే సినిమా మొత్తం చూడటానికి ఎంతమంది వస్తారో తెలియదు కానీ…

ఇలా సినిమా లో ఒక్క క్లైమాక్స్ ని మాత్రమే హైలెట్ చేస్తూ మిగిలిన సినిమాను సరైన విధంగా ప్రమోట్ చేయలేకపోతున్నారు అనే చెప్పాలి….బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది మేకర్స్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ని బట్టి చెప్పగలం…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here