Home న్యూస్ తెలుగు ఇండస్ట్రీ హిట్…తమిళ్ రీమేక్ లాస్ తెలిస్తే షాక్!!

తెలుగు ఇండస్ట్రీ హిట్…తమిళ్ రీమేక్ లాస్ తెలిస్తే షాక్!!

1251
0

2009 లో మగధీర సృష్టించిన ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందా అని ఎదురు చూసే సమయం లో ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ పడకుండా ఊచకోత కోసి మగధీర టోటల్ రన్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పవర్ స్టార్ అత్తారింటికి దారేది రికార్డ్ రెండేళ్ళు కొనసాగింది.

అలాంటి సినిమా ను ఈ ఇయర్ తమిళ్ లో రీమేక్ చేశారు… శింబు హీరోగా రీమేక్ చేసిన ఈ సినిమా కి వందా రాజా వాదాన్ వరువేన్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేయగా ఈ ఇయర్ ఫస్టాఫ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల మనసు గెలుచుకోలేక పోయింది.

ఈ సినిమా ను అక్కడ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన లైకా వారు 1 కోటి రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకోగా సినిమాను ఏకంగా 35 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ గా రూపొందించి థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లకు సినిమా ను అమ్మారు. కాగా సినిమా ఫైనల్ రన్ లో..

కేవలం 9 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టి 21 కోట్ల నష్టాన్ని మిగిలించింది. ఈ విషయానికి రీసెంట్ గా లైకా వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం తో తెలుగు లో అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ను రీమేక్ చేసి రిలీజ్ చేసినా ఇలాంటి రిజల్ట్ ఏంటి అనేది అందరికీ ఒకింత షాక్ ని గురి చేసింది.

సినిమాలో అంత సత్తా ఉందా అంటే కథ కొంచం వీక్ గా ఉన్నా ఇక్కడ పవర్ స్టార్ తన స్టామినా తో నిలబెట్టాడు, దేవి శ్రీ ప్రసాద్ వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ మ్యూజిక్ తో దుమ్ము లేపాడు. కానీ తమిళ్ లో శింబు స్టార్ డం సినిమాను నిలబెట్టలేక ఇండస్ట్రీ హిట్ రీమేక్ ని డిసాస్టర్ అయ్యేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here