Home న్యూస్ ఆడియన్స్ టాక్…ట్రైలర్ చూసి రాక్షసుడు రేంజ్ అనుకుంటే మోసం చేశారు!!

ఆడియన్స్ టాక్…ట్రైలర్ చూసి రాక్షసుడు రేంజ్ అనుకుంటే మోసం చేశారు!!

595
0

మహానటి సినిమా తో నటిగా ఫుల్ మార్కులు కొట్టేసిన కీర్తి సురేష్ ఆ ఒక్క సినిమా తో అంతకన్నా ముందు నటిగా ఎదురుకున్న విమర్శలకు సమాదానం చెప్పింది. ఆ సినిమా విజయం తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మరో హీరోయిన్ దొరికేసిందని అంతా అనుకున్నారు, అనుకున్నదే తగవుగా వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఒప్పుకోవడం మొదలు పెట్టింది కీర్తి సురేష్. తెలుగు లో మిస్ ఇండియా అలాగే….

సౌత్ లోని ఇతర భాషల్లో పెంగ్విన్ అనే సినిమా చేయగా ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని రీసెంట్ గా సొంతం చేసుకుంది. ఎంతకు అమ్మారు లాంటి విషయాలు రివీల్ చేయకున్నా కానీ నిర్మాత మాత్రం ప్రాజెక్ట్ తో సేఫ్ గా ఉన్నాడని తెలుస్తుంది.

ఇక సినిమా ఫస్ట్ టీసర్ అండ్ ట్రైలర్ తో సినిమా పై ఆసక్తి ఓ రేంజ్ లో పెంచారు. సైకో థ్రిల్లర్ కథ అవ్వడం తో ట్రైలర్ లో సస్పెన్స్ చూసి “అబ్బా సినిమా అదిరిపోయేలా ఉందని” సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు అనుకున్నారు, ట్రైలర్ కూడా 35 మిలియన్స్ కి పైగా…

వ్యూస్ ని అందుకుని లాక్ డౌన్ టైం లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా సంచలనం సృష్టించగా… సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఫస్ట్ 40-45 నిమిషాల వరకు మాత్రం అంచనాలను తగ్గట్లే సినిమా ఉన్నా కానీ తర్వాత టోటల్ గా గాడి తప్పడం, సెకెండ్ ఆఫ్ చాలా స్లో గా ఉండటం…

విలన్ ఎవరనేది చాలా సింపుల్ గా ఉండటం, క్లైమాక్స్ తేలిపోవడం తో చూసిన ఆడియన్స్ అందరూ ట్రైలర్ తో మోసం చేశారని, సినిమా లో అసలు విషయమే లేదనే….ట్రైలర్ చూసి రాక్షసుడు రేంజ్ అనుకుంటే మోసం చేశారని కామెంట్స్ చేస్తున్నారు… సినిమా పై విమర్శలు వస్తున్నా కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ పై మాత్రం పొగడ్తల వెల్లువ కురుస్తుండటం మాత్రం విశేషం అనే చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here