Home న్యూస్ అజయ్ దేవగన్ కొత్త సినిమా టాక్…1st డే ఎపిక్ కలెక్షన్స్ సామి!

అజయ్ దేవగన్ కొత్త సినిమా టాక్…1st డే ఎపిక్ కలెక్షన్స్ సామి!

0

బాలీవుడ్ లో రీమేక్ లతో కూడా ఎంతో కొంత సక్సెస్ లను ఈ మధ్యన సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరో అయిన అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన మైదాన్ మూవీ(Maidaan Movie) డిలే వల్ల హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా డిసాస్టర్ గా నిలవగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా తో వచ్చాడు…బేబి, ధోని, స్పెషల్ చేబ్బీస్ లాంటి…

ఎక్స్ లెంట్ సినిమాల డైరెక్టర్ అయిన నీరజ్ పాండే డైరెక్షన్ లో ఔరోవ్ మే కహా దం తా(Auron Mein Kahan Dum Tha) అనే సినిమా తీయగా కొంచం డిలే అయిన ఈ సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది….మొదటి నుండి సినిమా మీద ఏమాత్రం బజ్ లేక పోవడంతో…

పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆకట్టుకుంది కూడా ఏమి లేదు…..ఫ్లాష్ బ్యాక్ లో 2 మర్డర్ కేసుల వలన జైలులోనే ఉంటున్న హీరో జైలు నుండి శిక్ష అనుభవించిన తర్వాత కూడా అక్కడ నుండి వెళ్ళడానికి ఇష్టపడడు….

ఇంతకీ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి…ఆ మర్డర్ లు చేసింది ఎవరు….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….చాలా నీరసమైన కథ పాయింట్ తో తెరకెక్కిన సినిమా చూస్తున్న 2 గంటల 20 నిమిషాల సేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేలా చేస్తుంది….

ఆల్ మోస్ట్ తలపోటు తెప్పించి శుభం కార్డ్ పడిన తర్వాత హమ్మయ్య అయిపొయింది అనిపించింది సినిమా…ఆ రేంజ్ లో తలపోటు తెప్పించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ వసూళ్ళ ని అందుకుంది. రీసెంట్ టైంలో బాలీవుడ్ లో స్టార్స్ నటించిన సినిమాల్లో..

ఆల్ మోస్ట్ లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచింది…ఒక టికెట్ కొంటె ఒక టికెట్ ఆఫర్ అంటూ రిలీజ్ రోజు నుండే ఆఫర్ ఇచ్చినా కూడా సినిమా అతి కష్టం మీద 1.75 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని అత్యంత దారుణమైన స్టార్ట్ ను సాధించింది…ఇక వీకెండ్ లో తేరుకునే అవకాశం కూడా లేదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here