Home న్యూస్ ఒక్క డిసాస్టర్ ఎంత పని చేసింది…అజయ్ దేవగన్ కొత్త సినిమాకి మైండ్ బ్లాంక్ బుకింగ్స్!!

ఒక్క డిసాస్టర్ ఎంత పని చేసింది…అజయ్ దేవగన్ కొత్త సినిమాకి మైండ్ బ్లాంక్ బుకింగ్స్!!

0

హిట్ టాక్ తో కూడా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వవు….ఈ ఇయర్ సమ్మర్ లో బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన మైదాన్ మూవీ(Maidaan Movie) మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేక భారీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా కన్నా ముందు అజయ్ దేవగన్ దృశ్యం2 లాంటి బ్లాక్ బస్టర్, భోలా లాంటి యావరేజ్, సైతాన్ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫాంలోనే ఉండగా, మైదాన్ ఎపిక్ ఫ్లాఫ్ ఇప్పుడు అజయ్ దేవగన్ కొత్త సినిమా మీద భారీ ఎదురుదెబ్బ కొడుతుంది…నీరజ్ పాండే లాంటి క్రేజ్ ఉన్న డైరెక్టర్ తో…

అజయ్ దేవగన్ తబు ల కాంబోలో రూపొందిన ఔరోవ్ మే కహా దం తా(Auron Mein Kahan Dum Tha) అనే సినిమా తీయగా కొంచం డిలే అయిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా 3000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా…

ఇండియాలో 2500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి 3 రోజులు అవుతూ ఉండగా ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడం లేదు…టికెట్ సేల్స్ చాలా నీరసంగా ఉండగా రీసెంట్ టైంలోనే అజయ్ దేవగన్ కెరీర్ లోనే లోవేస్ట్ బుకింగ్స్ తో…

ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2.5 కోట్ల మార్క్ ని అందుకోవడం కూడా కష్టమే అని అంటున్నారు. టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంటే 3 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు అంటున్నారు కానీ 3 మంచి మూవీస్ తర్వాత…

ఒక్క ఫ్లాఫ్ ఇంపాక్ట్ తర్వాత మంచి స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను అందుకోబోతుంది. ఏమైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా తేరుకునే అవకాశం కనిపించడం లేదు. మరి సినిమాకి టాక్ ఎలా ఉంటుంది వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here