ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి “అవెంజర్స్ ఎండ్ గేమ్” మూవీ అంచనాలను పూర్తిగా మించే విధంగా ఉందని చెప్పాలి. కథ పాయింట్ లో చాలా కీలక సన్నివేశాల గురించి తెలిసిపోతుంది కాబట్టి ఏమాత్రం రివీల్ చేయకుండా సినిమా ఎలా ఉందో మాత్రం చెబుతున్నాం.
సినిమా కథ మొదటి పార్ట్ ఎండ్ నుండి మొదలు అయ్యి అనేక టర్న్ లు తీసుకుని ఎమోషనల్ గ ముగుస్తుంది, అదొక్కటి చెప్పగలం, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ ఏంటి, చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా బ్రతికారు, ఇప్పుడున్నవాళ్ళు అందరు ఉన్నారా ఎవరైనా చనిపోయారా అన్నవి మాత్రం థియేటర్స్ లో చూడాల్సిందే.
మోస్ట్ ఎపిక్ ఫైట్ సీన్స్ సినిమాలో ఓ రేంజ్ లో అలరించగా కీలక సూపర్ హీరోల హీరోయిజం సీన్స్ కి థియేటర్స్ షేక్ అయ్యాయి, ముఖ్యంగా ఐరన్ మాన్ అండ్ కాప్టన్ అమెరికా సీన్స్ కి రెస్పాన్స్ పీక్స్ లో ఉంది. మిగిలిన పాత్రలకు కూడా కొన్ని సీన్స్ అద్బుతంగా పడ్డాయి.
సినిమా మొత్తం మీద అంచనాలకు మించి ఉంటుంది, మార్వెల్ మూవీస్ లో అన్ని సినిమాలు చూసిన వాళ్లకి సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్లకి కూడా సినిమా నచ్చుతుంది కానీ అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వరు.
సినిమాలో ఉన్న ఒకేఒక్క మైనస్ పాయింట్…కొందరికి లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించడం అది తప్పితే సినిమా ఒక మాస్టర్ పీస్… విజువల్ వండర్ అని చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన సూపర్ హీరోస్ మూవీస్ లో ఒక బెంచ్ మార్క్ లా నిలిచే అద్బుత దృశ్యకావ్యం ఈ “అవెంజర్స్ ఎండ్ గేమ్”.
అలాగే 10 ఏళ్లుగా “అవెంజర్స్” లో పార్ట్ అయిన కొన్ని పాత్రలకు “అవెంజర్స్ ఎండ్ గేమ్” లో మంచి ముగింపు లభించింది. క్లైమాక్స్ చాలా మందికి షాకింగ్ గా అనిపించడం మాత్రం ఖాయం. మొత్తం మీద “అవెంజర్స్ ఎండ్ గేమ్” సినిమా ఈ మధ్య వచ్చిన ది బెస్ట్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా.
సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 4.5 స్టార్స్…ఇది మా హైయెస్ట్… ఇలాంటి సినిమాను మామూలు థియేటర్స్ లో కాకుండా మల్టీ ప్లేక్సులలో చూస్తేనే ఆ ఎఫెక్ట్ ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఎపిక్ వండర్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.