Home TRP రేటింగ్ కన్నడ గడ్డపై అల్లు అర్జున్ పంజా…రెండో సారి కూడా సెన్సేషనల్ TRP!

కన్నడ గడ్డపై అల్లు అర్జున్ పంజా…రెండో సారి కూడా సెన్సేషనల్ TRP!

1674
2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన హాట్రిక్ మూవీ అల వైకుంఠ పురంలో లాస్ట్ ఇయర్ సంక్రాంతి కి బాక్స్ అఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఊహకందని విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా పోటి ని కూడా తట్టుకుని టాలీవుడ్ తరుపున ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచింది.

అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత సాంగ్స్ రూపంలో యూట్యూబ్ లో కూడా అల్టిమేట్ రికార్డ్ వ్యూస్ తో దూసుకు పోతూనే ఉండగా సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది.

టాలీవుడ్ తరుపునే కాదు సౌత్ ఇండియా లో కూడా హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో సారి నుండి అంచనాలను తప్పినప్పటికీ ఫస్ట్ టైం రికార్డ్ మాత్రం ఎపిక్ అనే చెప్పాలి. ఇక సినిమా మలయాళంలో డబ్ అయినప్పుడు అక్కడ కూడా సాలిడ్ రేటింగ్ ను సాధించగా…

తర్వాత కన్నడ లో డబ్ వర్షన్ ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాకున్నా 5.34 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది అల వైకుంఠ పురం లో సినిమా. ఇక కొంత గ్యాప్ తర్వాత ఛానెల్ రీసెంట్ గా సినిమాను రెండో సారి కూడా టెలికాస్ట్ చేయగా రెండో సారి కూడా….

సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ కి 4.71 రేటింగ్ ను సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. కన్నడలో డబ్ అయిన మూవీస్ లో చాలా వరకు ఫస్ట్ టైం ఇలాంటి రేటింగ్ ను సాధించగా ఈ సినిమా రెండో సారికి కూడా ఈ రేంజ్ రేటింగ్ తో హోల్డ్ చేయడం విశేషం అని చెప్పొచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here