Home న్యూస్ ఎన్టీఆర్ టెంపర్ తమిళ్ రీమేక్ అయోగ్య…తెలుగు డబ్ 4 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

ఎన్టీఆర్ టెంపర్ తమిళ్ రీమేక్ అయోగ్య…తెలుగు డబ్ 4 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

1044
0

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా తమిళ్ రీమేక్ అయోగ్య అక్కడే నిరాశ పరిచిన విషయం తెలిసిందే, అలాంటి సినిమాను తెలుగు లో మళ్ళీ డబ్ చేసి రిలీజ్ చేశారు, సినిమాను ఏకంగా 2.2 కోట్ల రేంజ్ బిజినెస్ కి అమ్మగా బ్రేక్ ఈవెన్ కి 3 కోట్ల లోపు షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 34 లక్షల షేర్ ని అందుకుంది.

ఇక రెండో రోజు 22 లక్షల దాకా షేర్ ని మూడో రోజు 20 లక్షల దాకా షేర్ ని అందుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ ని ఓవరాల్ గా 76 లక్షల దాకా షేర్ తో ముగించింది. ఇక సోమవారం కూడా హాలిడే నే అవ్వడం తో సినిమా సుమారు 15 లక్షలకు పైగా షేర్ ని..

కలెక్ట్ చేసి మొత్తం మీద 4 రోజుల కలెక్షన్స్ పరంగా 90 లక్షలకు పైగానే షేర్ ని అందుకుంది, కాగా విశాల్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఉండటం తో ఈ సినిమా ఇక్కడ కూడా మంచి వసూల్లనే సాధించింది అని చెప్పాలి. ఇక్కడ విశేషం ఏంటి అంటే… ఆల్ రెడీ తెలుగు లో అందరు చూసినా కానీ..

రీమేక్ డబ్ అయ్యినా కానీ తిరిగి ఆడియన్స్ థియేటర్స్ కి వెళుతుండటం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 2 కోట్ల వరకు షేర్ ని సినిమా తెలుగు లో అందుకోవాల్సి వస్తుంది. సినిమాను తెలుగు లో 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

తక్కువ థియేటర్స్ లోనే సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించడం విశేషం, మొత్తం మీద ఇప్పుడు లాంగ్ రన్ లో సినిమా 1.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంతకు మించి సినిమా ముందుకు వెల్లగలుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here