టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో బాహుబలి తర్వాత సాహో, ఇప్పుడు సైరా నే అని చెప్పాలి, ఏకంగా 270 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయినా సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో తప్ప మిగిలిన చోట్ల బాహుబలి మరియు సాహో ని అందుకునే రేంజ్ లో అయితే లేవు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం దుమ్ము లేపుతుంది.
మరీ బాహుబలి రేంజ్ కాకున్నా మొదట్లో అల్టిమేట్ రికార్డులు నమోదు చేసిన సాహో ని బ్రేక్ చేసి ఇప్పుడు ఆల్ టైం టాప్ 2 ప్లేస్ తో దూసుకు పోతున్న సైరా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు సీడెడ్ ఏరియాలో ఓ అరుదైన రికార్డ్ ను నమోదు చేసింది. రిలీజ్ అయిన రోజు నుండి….
8 వ రోజు వరకు అక్కడ సినిమా నాన్ స్టాప్ గా రోజు కి కనీసం 1 కోటి రేంజ్ లో అయినా షేర్స్ ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు నాన్ స్టాప్ గా దుమ్ము లేపి ఆ కలెక్షన్స్ ఫ్లో కి 9 వ రోజున బ్రేక్ పడింది. దాంతో టాలీవుడ్ లో బాహుబలి తర్వాత సీడెడ్ లో…
వరుసగా ఇన్ని రోజులు మినిమం కోటి రేంజ్ లో షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది. అక్కడ బాహుబలి 2 సినిమా కంటిన్యు గా 11 రోజుల పాటు నాన్ స్టాప్ 1 కోటి రేంజ్ లో షేర్స్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు మెగాస్టార్ కూడా జోరు చూపుతూ…
8 రోజుల పాటు తన సత్తా చాటుకుని సంచలనం సృష్టించాడు. సైరా 8 రోజుల సీడెడ్ షేర్స్ ని గమనిస్తే Day1: 5.91cr, Day 2: 1.76cr, Day 3: 1.35Cr, Day 4: 1.31Cr, Day 5: 1.80Cr, Day 6: 1.21Cr, Day 7: 1.71Cr, Day 8: 1.15Cr ఇలా దుమ్ము లేపింది సైరా సినిమా… దాంతో సంచలన రికార్డ్ తో సత్తా చాటుకుంది.