Home న్యూస్ బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేసిందట సూర్యవంశీ సినిమా…!!

బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేసిందట సూర్యవంశీ సినిమా…!!

2043
0

ఏడాదిన్నరగా ఇతర ఇండస్ట్రీలు వేవ్ ల వలన ఇబ్బంది పడుతున్నా తిరిగి కోలుకుంటూ ఉన్నప్పటికీ ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ మట్టుకు కోలుకోవాలని ట్రై చేస్తూన్న కుదరక పోవడంతో చాలా వరకు సినిమాలను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా వాటిలో సక్సస్ ఫుల్ మూవీగా ఒక్కటి కూడా నిలవలేదు, అలాంటి టైం లో మహారాష్ట్రలో థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడంతో దీపావళికి…

భారీగా రిలీజ్ ను సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ సంచలనం సృష్టించింది… 5 రోజుల టైం కే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా గురించిన ఒక…

స్పెషల్ న్యూస్ ని రీసెంట్ గా బుక్ మై షో వాళ్ళు తెలియజేశారు… దీపావళి వీకెండ్ లో ఈ సినిమా టికెట్ సేల్స్ ఊహకందని స్పీడ్ తో జరిగాయని చెబుతూ ప్రీవియస్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 మరియు అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి సినిమాల కన్నా కూడా సెకనుకు అత్యధిక టికెట్ సేల్స్ ను…

ఈ సినిమా దీపావళి టైం లో సొంతం చేసుకుందని తెలియజేశారు. ఆ వీకెండ్ కి గాను పీక్ టైంస్ లో ఈ సినిమా సెకనుకు 17 టికెట్స్ కంటిన్యూగా సేల్ అవుతూ వచ్చాయని ఇది ఇంతవరకు జరగలేదని, బాహుబలి2 మరియు అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలు రిలీజ్ అయిన టైం లో సెకనుకి 10 టికెట్స్ సేల్ అయ్యేవని అంటున్నారు…. పండగ టైం అవ్వడం భారీ సినిమా అవ్వడం…

బాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుండో సినిమా హాల్స్ కి వెళ్ళాలి అన్న ఆత్రుత ఇవన్నీ కలిసి వచ్చి ఈ సినిమా కి ఇలాంటి రికార్డ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. సినిమా 6 రోజుల్లో 110 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 150 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని 200 కోట్ల వైపు దూసుకు పోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here