బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ మళ్ళీ జోరు అందుకుంది…వరుస పెట్టి రీ రిలీజ్ మూవీస్ వసూళ్ళ జోరు చూపించాయి… ఇక ఈ ఇయర్ లో మరిన్ని రీ రిలీజ్ లు కచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా ఇప్పుడు అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేయడానికి ఇండియన్ మూవీస్ లో ఎపిక్ రికార్డులతో…
సంచనాలు సృష్టించిన ఎపిక్ వండర్ బాహుబలి సినిమా(Baahubali movie Re Release) రాబోతుంది. రీసెంట్ గా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయగా అక్టోబర్ లో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు టైంలో ఈ రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.
ఇక్కడ స్పెషాలిటీ ఎంతంటే పార్ట్ అండ్ పార్ట్ 2 వేరు వేరుగా రీ రిలీజ్ కాకుండా రెండు పార్టులు కలిపి ఓవరాల్ గా ఒక పార్ట్ గా రీ రిలీజ్ చేయబోతున్నారట. అంటే రెండు పార్టులు కలిపి 6 గంటల ఫుటేజ్ తో కాకుండా రీ ఎడిట్ చేసి 3 గంటల లోపు ఫుటేజ్ తో…
సినిమాను రీ ఎడిట్ చేసి రెండు సినిమాలు కలిపి ఒక సినిమా గా రీ రిలీజ్ చేస్తున్నారట. దాంతో పాటు కుదిరితే కొన్ని డిలేట్ చేసిన సీన్స్ ను కూడా యాడ్ చేస్తారు అన్న టాక్ ఉంది….ఎపిక్ బాహుబలి మూవీ ని ఇలా రెండు పార్టులు కలిపి ఒక పార్ట్ గా హైలెట్ సీన్స్ అన్నీ కలిపి..
ఎడిట్ చేసిన వర్షన్ ఆడియన్స్ ముందుకు వస్తే కచ్చితంగా ఆడియన్స్ మరోసారి వెండితెరపై భారీ లెవల్ లో సినిమాను చూడటానికి ఎగబడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఈ రీ రిలీజ్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది…
అన్నీ అనుకున్నట్లు జరిగితే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ రీ రిలీజ్ ఊహకందని రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఈ అక్టోబర్ లో ప్రభాస్ పుట్టిన రోజుకి రీ రిలీజ్ మూవీస్ రికార్డుల జాతర ఖాయమని చెప్పాలి.