బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయిన సినిమా బేబీ జాన్(Baby John Movie)..వరుణ్ ధవన్ హీరోగా నటించిన ఈ సినిమా 2014 టైంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తెరీ సినిమా రీమేక్ గా రూపొందింది…మెయిన్ పాయింట్ ను తీసుకుని కథలో మార్పులు చేసి ఈ రీమేక్ చేశామని…
టీం చెబుతూ ఉండగా ఎంతవరకు ఈ సినిమా అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ అదే….తన కూతురుతో కలిసి కేరళలో ఒక మారు మూల ఊర్లో ఒక బేకరీ నడుపుకుంటాడు హీరో….సెకెండ్ హీరోయిన్ వామిక గబ్బి వలన హీరో ఎవరూ అక్కడికి…
ఎందుకు వచ్చాడు…తన ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుస్తుంది…ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి…తన ఫ్లాష్ బ్యాక్ లో కీర్తి సురేష్ కి ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేశాం అంటూ నిర్మాత అట్లీ కామెంట్స్ చేసినా కూడా చాలా వరకు సినిమా సీన్ టు సీన్…
తెరీ సినిమాకి కాపీ పేస్ట్ సీన్స్ తో నిండిపోయింది. యాక్షన్ బ్లాక్స్ మాత్రం బాగా వచ్చాయి..క్లైమాక్స్ లో సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ బాగుంది….హీరో ఎలివేషన్ సీన్స్, స్లో మోషన్ ఎఫెక్ట్ లు బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ లో కీలకమైన రేప్ సీన్ అండ్ విలన్ ని…
హీరో ఎం కౌంటర్ చేసే సీన్ ఇంపాక్ట్ బాగుంది….ఇవి ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది….వరుణ్ ధవన్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. హీరో ఎలివేషన్ సీన్స్ కూడా కుమ్మేశాడు. కానీ పోలిస్ గెటప్ తనకి అంత బాగా సెట్ అవ్వలేదు అనిపించింది…
కీర్తి సురేష్ రోల్ పర్వాలేదు అనిపించగా వామిక గబ్బి కూడా ఓకే అనిపించింది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్…ఇక మొత్తం మీద తెరీ సినిమాను చూసేసిన ఆడియన్స్ ఇక్కడ స్పెషల్ గా చూడటానికి ఏం లేదు..
యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయోచ్చు…అదే టైంలో ఒరిజినల్ చూడని ఆడియన్స్ కూడా సినిమాలో కీలకం అయిన రేప్ సీన్ టైప్ సన్నివేశాన్ని ఆల్ రెడీ సింబా సినిమాలో వాడేశారు…కానీ ఇందులో కూడా ఆ ఇంపాక్ట్ బాగుంది…. దాంతో డీసెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో…
ఆకట్టుకున్న బేబీ జాన్ మూవీ ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి ఎబో యావరేజ్ లెవల్ లో మినిమమ్ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఒరిజినల్ చూసిన వాళ్ళకి మాత్రం సీన్ బై సీన్ ఒరిజినల్ చాలా వరకు గుర్తుకు వస్తుంది. అది బరిస్తే ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు.. సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్.