Home న్యూస్ చరిత్రలో ఒకేఒక్కడు యంగ్ టైగర్…2 సార్లు 20M రికార్డ్

చరిత్రలో ఒకేఒక్కడు యంగ్ టైగర్…2 సార్లు 20M రికార్డ్

464
1

  టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు సోషల్ మీడియా రికార్డులు కూడా ఇప్పుడు ముఖ్యమే… సినిమా క్రేజ్ కి అద్దం పట్టే ప్రామాణికంగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే టీసర్లు మరియు ట్రైలర్ లకు వచ్చే వ్యూస్ ని కొలమానం గా చూస్తారు. బాహుబలి ట్రైలర్ చరిత్ర లో మరే తెలుగు ట్రైలర్ సాధించని లెవల్ లో రికార్డులు నమోదు చేయగా ఆ ట్రైలర్ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ లలో…

ఒక్క జైలవకుశ ట్రైలర్ మాత్రమే 20 మిలియన్ వ్యూస్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను అందుకోగా తర్వాత మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ట్రైలర్ మరోసారి 20 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

దాంతో టాలీవుడ్ హిస్టరీ లోనే రెండు సార్లు 20 మిలియన్ మార్క్ ట్రైలర్స్ ని అది కూడా బాక్ టు బాక్ అందుకున్న ఓకే ఒక్క హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చారిత్రిక రికార్డ్ ను అందుకున్నాడు. టీసర్ల విషయం లో కూడా జైలవకుశ టీసర్ మొదటి 20 మిలియన్ టీసర్ గా చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here