Home న్యూస్ 350 కోట్ల సినిమా….ఇక్కడ తిడుతున్నారు సామి…పాపం!!

350 కోట్ల సినిమా….ఇక్కడ తిడుతున్నారు సామి…పాపం!!

0

ఇండియాలో ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన భారీ సినిమాల్లో అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ల కాంబినేషన్ లో వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) ముందు నిలుస్తుంది…ఆల్ మోస్ట్ 350 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సీజన్ లలో ఒకటైన…

రంజాన్ కానుకగా రిలీజ్ అయ్యి అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఏ దశలో కూడా పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేయలేక పోయిన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది.

నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా కోసం భారీ రేటు చెల్లించి డిజిటల్ హక్కులను తీసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా డిజిటల్ లో ఆడియన్స్ ను అయితే ఎంతో కొంత మెప్పిస్తుందేమో అనుకుంటే ఇక్కడ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ మరింత దారుణంగా ఉంది. అసలు సినిమాలో ఏం కథ ఉందని చెప్పి…

350 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు…సినిమాలో 2 హీరోలు ఉన్నా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు అని, యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నా అసలు కథలోనే దమ్ము లేకపోవడంతో సినిమా మొత్తం బోర్ కొట్టిందని అంటున్నారు. ఇక ప్రుద్వీరాజ్ విలనిజం ఓ రేంజ్ లో హైలెట్ అవుతుంది అనుకున్నా తన సీన్స్ కి మినిమమ్ ఇంపాక్ట్ కూడా లేదని అంటున్నారు..

ఇలాంటి సిల్లీ స్టోరీ పాయింట్ తో వచ్చిన సినిమాకి 350 కోట్లు పెట్టడం అన్నది బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యాక చూసిన అ ఆడియన్స్ రియాక్షన్ థియేటర్స్ లో చూసిన వాళ్ళకన్నా కూడా నెగటివ్ గా ఉన్నాయంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. దాంతో డిజిటల్ లో కూడా సినిమాకి ఇక్కడ మరింత తీవ్రమైన రిజల్ట్ సొంతం అవ్వడం విచారకం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here