బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నట సింహం నందమూరి బాలకృష్ణ ల సినిమాల కలెక్షన్స్ ఒకప్పుడు నువ్వా నేనా అన్నట్లు ఉండేవి కానీ తర్వాత మెగాస్టార్ సినిమాలకు గ్యాప్ ఇవ్వడం, బాలయ్య సినిమాలు ఫ్లాఫ్ అవ్వడంతో మార్కెట్ పడిపోయింది. తిరిగి మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చే టైంకి బాలయ్య కూడా హిట్స్ కొట్టడం స్టార్ట్ చేసినా బిజినెస్ ల పరంగా కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ సూపర్ లీడ్ ని సొంతం చేసుకున్నాడు…
కానీ రీసెంట్ టైం లో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో మెగాస్టార్ సినిమాల బిజినెస్ లు కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఇదే టైంలో రీసెంట్ టైం లో వరుస డిసాస్టర్స్ తర్వాత ఆహా ప్రోగ్రాంతో ఆడియన్స్ లో మంచి రీచ్ ను సొంతం చేసుకున్న బాలయ్య అఖండ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు…
దాంతో ఇప్పుడు బాలయ్య వీర సింహా రెడ్డి బిజినెస్ ఆల్ మోస్ట్ మెగాస్టార్ వాల్తేరు వీరయ్యకి దగ్గరగా వచ్చే రేంజ్ కి వచ్చింది. ఒకసారి ఈ ఇద్దరు హీరోల లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ లను గమనిస్తే… ముందుగా బాలయ్య లాస్ట్ 5-6 మూవీస్ ని గమనిస్తే…
Veera Simha Reddy – 73CR
Akhanda – 53CR
RULER – 23.75CR
NTR Mahanayakudu – OWN Release
NTR Kathanayakudu – 70.58Cr
Jai Simha – 26.50CR~
ప్రస్తుతం తన కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ను వీర సింహా రెడ్డితో సొంతం చేసుకున్న బాలయ్య ప్రీవియస్ మూవీస్ యావరేజ్ గా 30 కోట్ల లోపే ఎక్కువగా జరిగాయి. ఎన్టీఆర్ మహానాయకుడు అయితే ఎవ్వరూ కొనకపోవడంతో ఓన్ రిలీజ్ చేసినా ఎన్టీఆర్ కథానాయకుడు నష్టాలను మినిమమ్ కూడా పూడ్చలేకపోయింది. ఇప్పుడు బిజినెస్ పరంగా మాసివ్ గ్రోత్ ను సొంతం చేసుకున్నాడు బాలయ్య…
ఇక మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ లను గమనిస్తే…
Waltair Veerayya – 88CR*****
Acharya – 131.20CR
God Father – 91CR/73Cr(Team)
SyeRaa Narasimha Reddy- 187.25Cr
KhaidiNo150- 89Cr
రీ ఎంట్రీతోనే ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ సైరాతో కెరీర్ బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకోగా తర్వాత ఆచార్యతో కూడా జోరు చూపించినా భారీ డిసాస్టర్ ఎఫెక్ట్ తో ఇప్పుడు బిజినెస్ ల పరంగా ఇంపాక్ట్ కనిపించింది. మరి ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల లేటెస్ట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.