నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఈ ఇయర్ గట్టి ఎదురుదెబ్బే తగిలింది, ఎంతో ఆశపడి తన తండ్రి స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ను సినీ అలాగే పొలిటికల్ నేపధ్యం లో బయోపిక్ గా తెరకెక్కించిన బాలయ్య సంక్రాంతి కి మొదటి పార్ట్ ను మార్చ్ లో రెండో పార్ట్ ని రిలీజ్ చేయగా రెండింటికి రెండు టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా చేరాయి.
కాగా రెండు కూడా పాజిటివ్ టాక్ తో కూడా ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకోవడం అందరికీ షాక్ ఇవ్వగా ఆ ప్రభావం బాలయ్య అప్ కమింగ్ మూవీస్ పై పడుతుంది అనుకున్నా ఇప్పుడు బాలయ్య తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్న…
కొత్త సినిమా పై పడలేదు అని చెప్పొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి బిజినెస్ రీసెంట్ గా మొదలు అవ్వగా ముందుగా సీడెడ్ ఏరియా లో బిజినెస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని టాక్ వస్తుంది కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాకి సీడెడ్ ఏరియా లో 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు సమాచారం, బయోపిక్ రెండు పార్టులు కూడా భారీ ఫ్లాఫ్స్ గా నిలిచినా కూడా బాలయ్య తన క్రేజ్ ఇంకా తగ్గలేదని ఈ బిజినెస్ తో నిరూపించుకుంటున్నాడు. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఇక సినిమా కూడా చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతుండగా ఈ సినిమా తర్వాత బోయపాటి తో మరో మాస్ మూవీ ని కమిట్ అయ్యాడు బాలయ్యా. ఆ సినిమా వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేసి రిలీజ్ చేస్తారని టాక్. ఇక జై సింహా తర్వాత మాస్ మూవీ ఇదే అవ్వడం తో బాలయ్య బాక్స్ ఆఫీస్ కంబ్యాక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది.