బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ దూసుకు పోతుండగా ఈ సినిమా కన్నా ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య పరిస్థితి ఏ విధంగా ఉండేదో అందరికీ తెలిసిందే.. జై సింహా హిట్ తర్వాత ఎంతో ఆశపడి కష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ అంచనాలను అందుకోలేక పోయింది…
టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటి తర్వాత ఒకటి నిలిచి బాలయ్య మార్కెట్ పై భారీ దెబ్బ కొట్టాయి. ఆ ఇంపాక్ట్ తర్వాత చేసిన కమర్షియల్ మూవీ రూలర్ కి కూడా కొనసాగగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ బిజినెస్ నే చేసినా కానీ..
ఆ బిజినెస్ ను అసలు అందుకోలేక బొబ్బ బోర్లా పడి బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ డిసాస్టర్ గా నిలిచింది…ఈ రేంజ్ వరుస దెబ్బల తర్వాత బాలయ్య పని అయిపోయిందని, ఇక కంబ్యాక్ కష్టమే అని అంతా అనుకున్నారు టాలీవుడ్ లో. కానీ బాలయ్య బోయపాటి తో కలిసి…
చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అఖండ సినిమా తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఆంధ్ర్రలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు టికెట్ హైక్స్ ఇలా అనేక అవరోధాల నడుమ సెకెండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ కి ఇంకా టైం తీసుకుంటున్న టైం లో ఇటు బాలయ్య అటు బోయపాటి ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ ధైర్యం చేసి ఆడియన్స్ ముందుకు వచ్చి….
ఇప్పుడు 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 100 కోట్ల సింహాసనంపై కూర్చునేలా చేసింది అని చెప్పాలి. ఈ విజయంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ది బెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి…. ఇక లాంగ్ రన్ లో అఖండ ఎంత దూరం వెళ్ళగలుగుతుందో చూడాలి.