Home గాసిప్స్ బాలయ్య అఖండ మ్యూజిక్ రైట్స్….కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్!

బాలయ్య అఖండ మ్యూజిక్ రైట్స్….కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్!

2282
1

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా లెజెండ్ మూవీస్ తర్వాత భారీ ఎత్తున రూపొందుతున్న హాట్రిక్ మూవీ అఖండ. బాలయ్య డ్యూయల్ రోల్ లో అలాగే కెరీర్ లో ఇప్పటి వరకు వేయని సరికొత్త అఘోరా గెటప్ లో ఈ సారి కనిపించబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రికార్డులతో దుమ్ము లేపుతూ…

ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో సంచలన రికార్డ్ ను నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక సినిమా బిజినెస్ పరంగా కూడా అద్బుతమైన బిజినెస్ ఆఫర్స్ ను సెకెండ్ వేవ్ ముందు వరకు సొంతం చేసుకోగా తర్వాత బిజినెస్ ను కొద్ది కాలం…

హోల్డ్ లో పెట్టారు. ఇక ఈ గ్యాప్ లో సినిమా సాంగ్స్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఫిక్స్ అవ్వగా లహరి మ్యూజిక్ వాళ్లకి సినిమా మ్యూజిక్ రైట్స్ ను సాలిడ్ రేటు కి అమ్మినట్లు తెలుస్తుంది. ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ మ్యూజిక్ రైట్స్ రేటు అని టాలీవుడ్ లో టాక్ చక్కర్లు కొడుతుంది.

బాలయ్య బోయపాటి కాంబో లో వస్తున్న ఈ హాట్రిక్ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో ప్రస్తుతానికి 4 సాంగ్స్ ఉంటాయని టాక్ ఉండగా 4 సాంగ్స్ కే ఏకంగా రేటు 1.35 కోట్ల రేటు ని మ్యూజిక్ రైట్స్ కింద అఖండ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. సీనియర్ హీరోల్లో కూడా ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ రేటు గా చెప్పుకోవచ్చు.

బాలయ్య బోయపాటి ల రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకొక పోయిన కానీ వీళ్ళ కాంబో పై ఉన్న క్రేజ్ దృశ్యా ఈ రేంజ్ రేటు సొంతం అయ్యిందని అంటున్నారు. ఇక సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటు ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా సాంగ్స్ ని ఒక్కోటిగా త్వరలో రిలీజ్ చేస్తారు అంటున్నారు. సినిమా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here