Home న్యూస్ సౌత్ లో ఇదే ఆల్ టైం రికార్డ్….టాలీవుడ్ చరిత్రలో బాలయ్య సినిమా!

సౌత్ లో ఇదే ఆల్ టైం రికార్డ్….టాలీవుడ్ చరిత్రలో బాలయ్య సినిమా!

2050
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన సెన్సేషనల్ హిట్స్ సింహా లెజెండ్ మూవీస్ తర్వాత బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న హాట్రిక్ మూవీ అఖండ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరూ కూడా తమ తమ ప్రీవియస్ మూవీస్ ఫ్లాఫ్ అయినా కానీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ దృశ్యా లేటెస్ట్ మూవీ అఖండ పై అంచనాలు…

ఓ రేంజ్ లో పెరిగి పోగా ఎప్పుడెప్పుడు సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఉగాది టైం లో రిలీజ్ చేసిన సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టీసర్ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను…

సృష్టించి ఊచకోత కోసింది. ఇప్పటి వరకు సీనియర్ హీరోల టీసర్ లు టాప్ రికార్డులను ఎప్పుడూ బ్రేక్ చేయలేదు, సౌత్ లో రజినీ టీసర్ ల రికార్డులను ఎవ్వరూ బ్రేక్ చేయలేదు కానీ అఖండ టీసర్ మాత్రం సీనియర్ హీరోల్లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా జోరు అలానే చూపి…

ఇప్పుడు ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని ఎపిక్ రికార్డ్ ను సాధించి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ టీసర్ ల పరంగా ఈ మార్క్ ని అధిగమించిన మూడో టీసర్ గా సౌత్ లో ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సీనియర్ హీరో టీసర్ గా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది బాలయ్య అఖండ టీసర్…

అది కూడా రిలీజ్ అయిన అతి తక్కువ టైం లోనే ఇలాంటి జోరు ని చూపెట్టి ఏకంగా టాలీవుడ్ టీసర్ లలో క్రేజీ సినిమాల టీసర్ లను కూడా క్రాస్ చేసి ఇప్పుడు సంచలనం సృష్టించడం విశేషం. ఈ రేంజ్ క్రేజ్ తర్వాత ఇక సినిమా ట్రైలర్ కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఓ రేంజ్ లో అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here