నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ మరో లెవల్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లిస్టులో వీళ్ళ కాంబినేషన్ కూడా కచ్చితంగా ఉంటుంది. బాలయ్య ని మిగిలిన డైరెక్టర్స్ కన్నా కూడా చాలా బెటర్ గా పవర్ ఫుల్ గా చూపెట్టే డైరెక్టర్ గా బోయపాటికి మంచి పేరు ఉంది. అందుకే ఇద్దరూ ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నా కానీ…
వీళ్ళ కలయిక మీద క్రేజ్ దృశ్యా వస్తున్న మూడో సినిమా పై అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. బాలయ్య కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీ గా ఈ సినిమా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన….
షూటింగ్స్ అన్నీ నత్తనడకన సాగుతుండగా థియేటర్స్ కూడా ఎప్పుడు తెరచుకుంటాయి అన్నది క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఇయర్ ఎండ్ కి సద్దుకుంటుంది అని, వచ్చే సంక్రాంతి నుండి అంతా మాములుగా మారుతుంది అని అందరూ కోరుకుంటున్నారు. అదే ఆశతో ఇప్పుడు వీళ్ళ కాంబో లో వస్తున్న సినిమా షూటింగ్ ని…
సెప్టెంబర్లో మొదలు పెట్టాలని చూస్తున్నారు… సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ జరుగుతుందని,… సినిమాను సంక్రాంతి రేసులో నిలపాలని బాలయ్య బోయపాటి భావిస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య ఇది వరకు సంక్రాంతి కి వచ్చిన సందర్భంలో ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ పక్కకు పెడితే మిగిలిన సినిమాలు బెటర్ రిజల్ట్ ని ఇచ్చాయి.
ఈ సారి మంచి హైప్ నడుమ సినిమా తెరకెక్కు తుండటం తో కచ్చితంగా సంక్రాంతి రేసులో నిలిచి పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి అప్పటికి కరోనా తగ్గి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్ధకం అనే చెప్పాలి…