Home గాసిప్స్ బాలయ్య “సూపర్ మాన్”…ఇదేమి షాక్ సామి!!

బాలయ్య “సూపర్ మాన్”…ఇదేమి షాక్ సామి!!

1103
0

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫాం కోల్పోయిన పరిస్థితి లో ఉన్నా కానీ ఒక్క టీసర్ తో మళ్ళీ అందరి అంచనాలను అందుకునే రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తనతో పాటు బోయపాటి శ్రీను కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ పై క్రేజ్ ఎంతలా ఉందొ రీసెంట్ గా రిలీజ్ అయిన బి బి 3 రోర్ టీసర్ గ్లిమ్స్ నిరూ పించింది.

వీళ్ళ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సింహా లెజెండ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ వేట లో ఉన్న టీం ఈ సినిమా కి మోనార్క్ అనే టైటిల్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసింది అన్న వార్తలు వచ్చాయి. మొదటి 2 సినిమాల టైటిల్స్ రేంజ్ లో…

పవర్ ఫుల్ కాకున్నా కానీ ఈ టైటిల్ కి కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చినా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. కాగా ఇప్పుడు ఈ టైటిల్ బదులుగా మరో టైటిల్ ని అనుకుంటున్నారు అని ఇండస్ట్రీ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ టైటిల్ పేరే సూపర్ మాన్…

హాలీవుడ్ మూవీ క్యారెక్టర్ పేరు అయిన ఈ టైటిల్ తో తెలుగు లో సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో సినిమా చేశారు. తర్వాత ఎవ్వరూ ఈ టైటిల్ ని వాడలేదు. కానీ ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కి ఈ టైటిల్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు అని అంటున్నారు. వినడానికి కొద్దిగా వింతగా టైటిల్ ఉన్నప్పటికీ…

రీచ్ అండ్ క్రేజ్ పరంగా చూసుకుంటే ఈజీగా వైరల్ అయ్యే టైటిల్ అనే చెప్పాలి. కానీ సింహా అండ్ లెజెండ్ రేంజ్ పవర్ ఫుల్ టైటిల్ అయితే కాదు. మరి టీం ముందు అనుకున్న మోనార్క్ ని ఓకే చేస్తారా లేక సూపర్ మాన్ ని ఓకే చేస్తారా లేక మరో కొత్త టైటిల్ ఏదైనా వెతుకుతారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here