Home గాసిప్స్ BB3 లో…బాలయ్యని డీ కొట్టే విలన్ ఇతనే!!

BB3 లో…బాలయ్యని డీ కొట్టే విలన్ ఇతనే!!

2052
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఒకటి కి మించి మరోటి విజయాలను నమోదు చేశాయి. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా BB3 కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య బోయపాటి సినిమా లో విలన్ రోల్ కి కూడా చాలా ఇంపార్టంట్స్ ఉంటుంది, సింహా లో చాలా మందే విలన్స్ ఉండగా లెజెండ్ లో మాత్రం జగపతిబాబు విలనిజం అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరి కాంబో లో వస్తున్న…

మూడో సినిమా లో ఎవరిని విలన్ గా తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్యా వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ ని తీసుకోవడం కొద్దిగా కష్టం అవ్వడంతో మన దగ్గర ఉన్న టాలెంట్ ని వాడుకోవాలని ఫిక్స్ అయిన టీం ఓ యంగ్ హీరో ని విలన్ గా తీసుకున్నారట.

అందాల రాక్షసి తో టాలీవుడ్ కి పరిచయం అయినా అడపాదడపా సినిమాలు చేసినా అరవింద సమేత తో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ని ఇందులో మెయిన్ విలన్ రోల్ కి తీసుకున్నారన్న టాక్ ఉంది. చాలా కీలక మైన పాత్ర అని చెబుతున్నారు కానీ మెయిన్ విలన్ గా నటిస్తున్నారా లేదా అన్నది చెప్పలేదు.

కానీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం సినిమాలో విలన్ రోల్ లోనే నవీన్ చంద్ర కనిపించ బోతున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకో బోతుండగా ఇప్పుడు ఈ ఇయర్ లో వచ్చే చాన్స్ లేదని వచ్చే ఇయర్ వస్తుందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here