Home న్యూస్ భూములు పంచుకుంటున్నారు అన్న బాలయ్య…నువ్వు కింగ్ కావు ఒక యాక్టర్ వే అన్న నాగబాబు!!

భూములు పంచుకుంటున్నారు అన్న బాలయ్య…నువ్వు కింగ్ కావు ఒక యాక్టర్ వే అన్న నాగబాబు!!

0

కరోనా వైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ లో రోజు ఎన్ని కేసులు వస్తున్నాయి అన్న వాటి తోనే సరిపోతుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ లో నటీనటుల వాగ్వాదం మొదలు అయింది, లేటెస్ట్ గా ఇండస్ట్రీ నుండి కొందరు తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్ గురించి ఇతర చారిటీ పనుల గురించి తరచూ కలుస్తూ ఉండగా నేడు బాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ ఇప్పటి వరకు తనని ఎవ్వరూ ఇలాంటి మీటింగ్స్ కి పిలవలేదని కామెంట్స్ చేశాడు.

దాంతో పాటు కొంచం కోపంగానే వీళ్ళు హైదరాబాదులో భూములు పంచుకోవడం కోసం మీటింగ్స్ పెట్టుకుంటున్నారు అని కూడా కామెంట్స్ చేశాడు బాలయ్య. దీనికి సమాదానంగా బాలయ్య తో 2 సినిమాలు నిర్మించిన సి.కళ్యాణ్ తమకి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళని ఇలాంటి మీటింగ్స్ కి తీసుకు వెళతామని…

అలాగే బాలయ్య నిర్మాత ఏమి కాదు కదా అంటూ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియా లో బాలయ్య ఫ్యాన్స్ మరి త్రివిక్రమ్, రాజమౌళి లు నిర్మాతలా అంటూ ప్రశ్నిస్తూ ఉండగా ఈ గ్యాప్ లో మెగా బ్రదర్ నాగబాబు వీడియో ఈ వాగ్వాదం మరింత పెరిగేలా చేసిందని చెప్పొచ్చు.

బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలి, బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. పరిశ్రమనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానపరిచారు అంటూ కామెంట్స్ చేసిన నాగబాబు, దాంతో పాటు తనని పిలవలేదు అన్న వాఖ్యలకు… నువ్వేమి కింగ్ వి కాదు నిన్ను పిలవడానికి నువ్వు కూడా ఒక యాక్టర్ వే అంటూ వాఖ్యలు చేశాడు. దాంతో పాటు… భూములు పంచుకోవడం లాంటివి…

ఆంధ్రలో మీరు ఎలా చేశారో చూశాం కదా అంటూ కూడా కామెంట్స్ చేశాడు నాగబాబు. ఇక ప్రభుత్వం నుండి తలసాని మాట్లాడుతూ బాలయ్య ఎందుకు అలా కామెంట్ చేశాడో తెలుసుకుని సమాదానం చెబుతానని వ్యాఖ్యానించారు….మొత్తం మీద ఇవాళ సోషల్ మీడియా లో బాలయ్య కామెంట్స్ వైరల్ అవ్వగా డానికి సమాదానంగా వచ్చిన కామెంట్స్ కూడా మరింత వైరల్ అయ్యాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here