Home న్యూస్ బాలయ్య మాస్ సామి….అక్కడే కాదు…ఇక్కడ కూడా హాట్రిక్..కానీ ఇది చరిత్ర!

బాలయ్య మాస్ సామి….అక్కడే కాదు…ఇక్కడ కూడా హాట్రిక్..కానీ ఇది చరిత్ర!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా ఒకటి తర్వాత ఒకటి హాట్రిక్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు…ఇటు సినిమాలలో ఫుల్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య మరో పక్క ఎలక్షన్స్ లో కూడా…

ఫుల్ బిజీగా ఉంటూ అటు ఎలక్షన్స్ లో ఇటు సినిమాల్లో పెర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేస్తూ ఉండగా రెండు సార్లు ఆల్ రెడీ MLA గా గెలిచిన నట సింహం ఈ సారి మూడో సారి కూడా తన సత్తా చాటుకున్నాడు…ఆపోజిషన్ వాళ్ళు ఈ సారి బాలయ్య ఓటమి ఖాయం అంటూ ప్రచారాలు చేసినా కూడా…

నట సింహం మరోసారి తన సత్తాచాటాడు, మూడో సారి MLA గా గెలిచి దుమ్ము లేపాడు బాలయ్య…హిందూపూర్ లో వరుసగా మూడోసారి MLA గా గెలిచి రచ్చ చేశాడు బాలయ్య. దాంతో అటు సినిమాల్లో హాట్రిక్ విజయాలను నమోదు చేయడం, బాక్ టు బాక్ 70 కోట్ల సినిమాతో రచ్చ లేపి ఫుల్ ఫామ్ లో ఉండగా…

ఇటు రాజకీయాలలో కూడా బాక్ టు బాక్ 3 సార్లు MLA గా గెలవడం మామూలు అచీవ్ మెంట్ కాదు…సినిమాల్లో విజయాలు అపజయాలు కామన్ కానీ రాజకీయాల్లో మాత్రం ఇలా మూడు సార్లు గెలవడం అన్నది మామూలు విషయం కాదు, చరిత్రలో నిలిచే విషయం. బాలయ్య అటు సినిమాలను ఇటు రాజకీయాలను బాగా బాలెన్స్ చేస్తూ ఉండగా…

ఇప్పుడు హట్రిక్ విజయాలు అటు హాట్రిక్ MLA రికార్డుల తర్వాత బాలయ్య నుండి వచ్చే అప్ కమింగ్ మూవీస్ కూడా ఫుల్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఆ సినిమాల ఇంపాక్ట్ ఇప్పుడు మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బాలయ్య అప్ కమింగ్ మూవీ ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది…

Bhagavanth Kesari 15 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here