Home గాసిప్స్ చిరు అనుకున్న సినిమా లుక్ లో బాలయ్య!!

చిరు అనుకున్న సినిమా లుక్ లో బాలయ్య!!

588
0

అనుకుని కావచ్చు అనుకోకుండా కావచ్చు కానీ లేటెస్ట్ గా నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా లెజెండ్ సినిమా ల తర్వాత తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ టీసర్ ని రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. కాగా బాలయ్య హెయిర్ కట్ మట్టుకు సింహా లెజెండ్ సినిమా ల మాదిరిగానే ఆల్ మోస్ట్ కనిపించి మెప్పించింది అని చెప్పొచ్చు.

అదే సమయం లో టోటల్ గెటప్ మాత్రం మరో సినిమా గెటప్ ని గుర్తు చేసింది, ఆ సినిమా నే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి త్వరలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కద్దరు చొక్కా, పంచె కట్టు తో బాలయ్య లుక్ పల్లెటూరి నేపధ్యంలో పెర్ఫెక్ట్ గా సెట్ అయినా…

టీసర్ స్లో మోషన్ విజువల్స్ కానీ ఓవరాల్ లుక్స్ కానీ మలయాళం లో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా లుక్ ని గుర్తు చేశాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే చిరంజీవి కూడా ఇలాంటి లుక్ లోనే లూసిఫర్ రీమేక్ లో నటించాలి అని భావించాడు.

కానీ ఇప్పుడు బాలయ్య బోయపాటి సినిమా లుక్ అచ్చూ అలాగే ఉండటం తో ఇది సినిమా మొత్తం కంటిన్యు అవుతుందా లేక ఈ ఒక్క సీన్ కే పరిమితం అవుతుందా అన్న విషయాలు తెలుసుకోవాలని భావిస్తున్నాడట. ఈ ఒక్క సీన్ కే అయితే మాత్రం లూసిఫర్ రీమేక్ లో ఇదే లుక్ లో కనిపించాలని భావిస్తున్నాడట చిరు.

ఒకవేళ బాలయ్య లుక్ సినిమా మొత్తం ఇదే విధంగా ఉంటే… లూసిఫర్ రీమేక్ లుక్ మరింత కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నాడట. మొత్తం మీద బాలయ్య లుక్ ఇప్పుడు లూసిఫర్ రీమేక్ లుక్ కి అడ్డుగా వస్తున్నా చిరు కూడా ఇలాంటి లుక్ లో ఉంటే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆశగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here