బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉన్న టైంలో నుండి ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటుకున్నాడు…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిమార్కబుల్ డామినేషన్ వలన డాకు మహారాజ్ కొంచం స్లో అయినట్లు అనిపించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది. ఇక ఈ సినిమా బడ్జెట్ పరంగా అనుకున్న దాని కన్నా కూడా…
ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కగా బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాలిడ్ గా పెరిగింది అని అంటున్నారు ఇప్పుడు….అఖండ టైం కన్నా ముందు బాలయ్య ఒక్కో సినిమా కి 8-10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోగా అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత 12-14 కోట్ల రేంజ్ లో…
రెమ్యునరేషన్ ని తీసుకోగా తర్వాత చేసిన భగవంత్ కేసరి సినిమా టైంకి 17-18 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి కుమ్మేసిన డాకు మహారాజ్ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని…
బాలయ్య తీసుకున్నాడని అంటున్నారు…ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు ఈ లెక్క ఆల్ మోస్ట్ 22 కోట్ల రేంజ్ లో ఉంటుంది అన్న టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉంది. టాలీవుడ్ సీనియర్స్ లో సినిమా సినిమా కి తన రేంజ్ ని…
పెంచుకుంటూ వరుస హిట్స్ తో సాలిడ్ మార్కెట్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న బాలయ్య ఇక అఖండ 2 సినిమా కి తన కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఇయర్ లోనే రాబోతున్న ఆ సినిమా ఏ రేంజ్ లో ఊచకోత కోస్తుందో చూడాలి.