నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన సినిమా నర్తనశాల. భారీ స్టార్ కాస్ట్ తో బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా ను కొంత భాగం షూటింగ్ జరిపిన తర్వాత 2004 లో అనుకోకుండా సౌందర్య గారి మరణం వలన మధ్య లోనే ఆపేయాల్సి వచ్చింది, తర్వాత ఈ ఫూటేజ్ ని ఎం చేయాలో తెలియక అలానే ఇన్నాళ్ళు ఉంచేశాడు బాలయ్య…
కానీ ఇన్నేళ్ళ తర్వాత ఈ 17 నిమిషాల లెంత్ ఉన్న ఈ ఫూటేజ్ ని ఇప్పుడు 24 న విజయదశమి కానుకగా రిలీజ్ చేయనున్న బాలయ్య శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో రిలీజ్ చేయబోతుండగా సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు.
1 నిమిషం లెంత్ ఉన్న ఈ మినీ ట్రైలర్ ను లాంచ్ చేయగా అప్పటి వుజువల్స్ అయినా కానీ క్వాలిటీ అదిరిపోయే విధంగా ఉందని చెప్పాలి, సౌందర్య గారి స్క్రీన్ ప్రజెన్స్ మెస్మరైజింగ్ అనిపించే విధంగా ఉండగా శ్రీహరి హరి భీముడి లుక్ కూడా అదిరిపోయింది అని చెప్పాలి.
ఈ ఇద్దరి కి చెప్పిన డబ్బింగ్ మాత్రం అంత బాగా సెట్ కాలేదు కానీ ఓవరాల్ గా మినీ ట్రైలర్ మిగిలిన ఫూటేజ్ ఎలా ఉండబోతుందో అన్నది చిన్న హింట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక 17 నిమిషాల ఫూటేజ్ లో బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పిన భారీ లెంత్ ఉన్న డైలాగ్ మొత్తం మీద మేజర్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ లో మొదలు అవ్వగా ఈ నెల 24 న దసరా కానుకగా ఉదయం 11 గంటల 49 నిమిషాలకు ఈ 17 నిమిషాల ఫూటేజ్ రిలీజ్ కానుంది. ఇక ఈ ఫూటేజ్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఆడియన్స్ ని ఎలా థ్రిల్ చేస్తాయో చూడాలి మరి…
https://www.youtube.com/watch?v=cgUlBCD10ZM