Home న్యూస్ రవితేజతో బాలయ్య ఢీ….ఏమవుతుందో మరి!!

రవితేజతో బాలయ్య ఢీ….ఏమవుతుందో మరి!!

655
0

టాలీవుడ్ లో సడెన్ గా లాస్ట్ ఇయర్ నుండి ఆగిపోయిన సినిమాలు అన్ని ఒక్క సారిగా థియేటర్స్ వైపు ఎగబడుతున్నాయి. ఎంతలా అంటే ప్రతీ వారం ఒక నోటబుల్ మూవీ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది అంటే ఏ రేంజ్ లో తెలుగు సినిమాలు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు, కానీ ఇదే టైం లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ కి కూడా సిద్ధం అవుతుండటం గమనార్హం.

అందులో ఇప్పుడు లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు నట సింహం బాలయ్య… ఆల్ రెడీ మాస్ మహారాజ్ రవితేజ బుక్ చేసుకున్న రిలీజ్ డేట్ ను సడెన్ గా నేను ఆ డేట్ కే వస్తున్నాను అంటూ రిలీజ్ డేట్ ని కన్ఫాం చేశారు. రవితేజ క్రాక్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగా…

ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడీ బాక్స్ ఆఫీస్ దగ్గర మే 28 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా ఇప్పుడు అదే రోజు సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టిన రోజు అవ్వడం తో ఆ రోజున బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబో లో వస్తున్న హాట్రిక్ మూవీ ని రిలీజ్ చేయబోతున్నట్లు…

రీసెంట్ గా అఫీషియల్ పోస్టర్ తో కన్ఫాం చేశారు. దాంతో అనుకోకుండా ఇప్పుడు రెండు సినిమాల మధ్య పోటి కన్ఫాం అయింది. మరి ఎవరో ఒకరు తగ్గి పోటి లేకుండా ఓపెన్ గ్రౌండ్ చూసుకుంటారా లేక పోటి పడతారో అనేది రెండు సినిమాల టీం లకే తెలియాలి. క్రాక్ కి ముందు రవితేజ వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకున్నా క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చాడు, ఇప్పుడు ఫాంలో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.

అదే టైం లో బాలయ్య బోయపాటిలు ఇద్దరూ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో హాట్రిక్ మూవీ అవ్వడంతో క్రేజ్ మరింత ఎక్కువ ఉంది, ఆ లెక్కన బాలయ్య బోయపాటి మూవీకే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. కానీ జూన్ మొత్తం ఖాళీగా ఉన్న నేపధ్యంలో ఒకవేళ పోటి కన్ఫాం అయినా టాక్ వస్తే రెండు సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here