Home గాసిప్స్ 60 కోట్ల బడ్జెట్ సినిమా..ఇందులో బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!!

60 కోట్ల బడ్జెట్ సినిమా..ఇందులో బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!!

2749
0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ భారీ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ముఖ్యంగా బాలయ్య రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి, ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ కానీ తర్వాత చేసిన రూలర్ సినిమా కానీ ఒకదాని మించి ఒకటి ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైం లో బాలయ్య కంబ్యాక్ పై భారీ హోప్స్ ని పెంచిన సినిమాగా…

బోయపాటి తో ఇప్పుడు చేస్తున్న అఖండ సినిమా అనే చెప్పాలి. బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ దృశ్యా ఈ సినిమాతో కచ్చితంగా బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని గట్టిగా సొంతం చేసుకోవడం ఖాయమని అంతా నమ్ముతున్నారు.

ఆ నమ్మకమే సినిమా నిర్మాతకి కూడా ఉండగా సినిమా బడ్జెట్ ను ముందు ఒక లెక్క అనుకుని ఔట్ పుట్ చేసి బడ్జెట్ ని అమాంతం పెంచి క్వాలిటీ విషయం లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా ను మొత్తం మీద ఇప్పుడు ఏకంగా 60 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ ఎత్తున రూపొందిస్తున్నారు.

ఆ రేంజ్ బడ్జెట్ అంటే రెమ్యునరేషన్ లకే ఎక్కువ అమౌంట్ వెళుతుంది అనుకుంటారు అందరు, కానీ అలా జరగలేదట, సినిమా గ్రాఫిక్స్ అండ్ సెట్స్ ఖర్చుల దృశ్యా ఎక్కువ అమౌంట్ ని పెట్టారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ లో బాలయ్య రెమ్యునరేషన్ పరంగా ఇప్పుడు కేవలం 6.5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకుంటున్నారని లేటెస్ట్ టాక్.

దానికి కారణం ఇతర సినిమాల రిజల్ట్ లు అని కూడా తెలుస్తుంది, అలాగే సినిమా క్వాలిటీ దృశ్యా బడ్జెట్ ను పెంచిన నిర్మాత కి మరింత భారం పెట్టకూడదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక సినిమా కంప్లీట్ బిజినెస్ ను పూర్తీ చేసుకున్నాక లాభాలు వస్తే అప్పుడు కొంత అమౌంట్ ని తీసుకుంటానని బాలయ్య చెప్పినట్లు టాక్. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here