Home న్యూస్ రూలర్ ట్రైలర్ రివ్యూ… బాలయ్య భీభత్సం!

రూలర్ ట్రైలర్ రివ్యూ… బాలయ్య భీభత్సం!

812
0

    నట సింహం నందమూరి బాలకృష్ణ కే.ఎస్. రవికుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ నెల 20 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా అఫీషియల్ టీసర్ ముందు రిలీజ్ చేయగా బాలయ్య కొన్ని లుక్స్ మినగా టీసర్ కి మంచి టాక్ లభించింది, ఇక తర్వాత రిలీజ్ చేసిన తొలి లిరికల్ వీడియో కి కూడా రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చింది.

ఇక ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు, ట్రైలర్ చూస్తుంటే బాలయ్య భీభత్సం ఓ రేంజ్ లో ఉందని తెలుస్తుంది, టోని స్టార్క్ లుక్ మాత్రం అరుపులు పుట్టించే విధంగా ఉందని చెప్పొచ్చు. రీసెంట్ టైం లో బాలయ్య లుక్స్ లో ఇంతటి స్టైలిష్ లుక్ మరోటి లేదు.

కానీ అదే సమయం లో సినిమాలో వేరే గెటప్స్ ఏమాత్రం సెట్ కాలేదు అన్నది కూడా నిజం ట్రైలర్ కి ఏమైనా మైనస్ పాయింట్ ఉందీ అంటే అది ఆ లుక్స్ అనే చెప్పాలి, అది తప్పించి ట్రైలర్ మొత్తం బాలయ్య వన్ మ్యాన్ షో గా ఉందని చెప్పాలి.

డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ పార్ట్, హీరోయిన్స్ గ్లామర్, భారీ స్టార్ కాస్ట్ ఇలా ట్రైలర్ లో చాలా అంశాలానే చూపెట్టారు, మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఆకట్టుకునేలా ఉండగా ట్రైలర్ ఎండింగ్ లో తుపాకీ చేతితో బాలయ్య తిప్పే సీన్ ఓవరాల్ గా ట్రైలర్ కి హైలెట్ అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా మళ్ళీ కమర్షియల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య ట్రైలర్ తో చాలా వరకు మెప్పించాడు, ముఖ్యంగా టోని స్టార్క్ లుక్ తో వెండి తెరపై బాలయ్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. మీరు ట్రైలర్ చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here