Home న్యూస్ బాలయ్య నోట ఎన్టీఆర్ మాట…ఆడిటోరియం దద్దరిల్లింది!!

బాలయ్య నోట ఎన్టీఆర్ మాట…ఆడిటోరియం దద్దరిల్లింది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అఖండ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుండగా సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజ్ కాబోతున్న మొట్ట మొదటి బిగ్ స్టార్ మూవీ అవ్వడంతో అందరి చూపు ఈ సినిమా పై ఉంది. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్….

ఛీఫ్ గెస్ట్ గా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా ఎస్ ఎస్ రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్ గా ఈవెంట్ లో పాల్గొన్నారు. కాగా ఈవెంట్ లో అల్లు అర్జున్ బాలయ్య గురించి గొప్పగా చెప్పగా బాలయ్య కూడా అల్లు ఫ్యామిలీ గురించి అల్లు అర్జున్ గురించి కూడా….

అంతే బాగా చెప్పడం విశేషం… ఇక బాలయ్య అఖండ ఈవెంట్ కి ముందుగా ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తారు అనుకున్నారు కానీ కొన్ని అనుకోని కారణాల వలన కుదరలేదు… ఈవెంట్ లో ఎన్టీఆర్ లేకున్నా కానీ ఎన్టీఆర్ మాట వినిపించినప్పుడల్లా ఆడిటోరియం దద్దరిల్లి పోయింది అని చెప్పాలి.

తమన్ గురించిన AV లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ అడిరిపోవడం ఒకెత్తు అయితే బాలయ్య స్టేజ్ పైన అప్ కమింగ్ బిగ్ మూవీస్ అన్నింటికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం. పుష్పకి, ఆచార్యకి ఆల్ ది బెస్ట్ చెబుతూ చిరు మాట స్టేజ్ పైన చెప్పడం రీసెంట్ టైం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. దాంతో ఇద్దరి మధ్య మళ్ళీ అంతా సెట్ అయ్యే టైం వచ్చిందని అనుకుంటున్నారు అందరూ…

ఇక ఈవెంట్ లో హైలెట్ బాలయ్య ఎస్ ఎస్ రాజమౌళితో తమ్ముడు రామ్ చరణ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పే టైం లో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది… ఎన్టీఆర్ పై రీసెంట్ గా కొందరు పొలిటికల్ గా ఒక అజెండాతో చేస్తున్న కామెంట్స్ కి బాలయ్య నోటి నుండి ఎన్టీఆర్ మాట వినడం, దానికి ఆడిటోరియం దద్దరిల్లడం లాంటివి బిగ్ హైలెట్స్ గా చెప్పొచ్చు. ఇక అఖండ ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2 న రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here