బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయగా హాట్రిక్ విజయాల తర్వాత ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా…రీసెంట్ టైంలో బాలయ్య చేసిన సినిమాలతో పోల్చితే మంచి జోరుతో ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని బాలయ్య కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీక్ వసూళ్ళని సొంతం చేసుకుంది… అఖండ మూవీ ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో 45.11 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 53.49 కోట్ల షేర్ ని సాధించింది…
తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 58.51 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 68.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఫస్ట్ వీక్ లో 44.54 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా…
వరల్డ్ వైడ్ గా 55.09 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి మాసివ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 61.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 73 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకున్న డాకు మహారాజ్ మూవీ ఇక లాంగ్ రన్ లో బాలయ్య కెరీర్ బెస్ట్ షేర్ ని ఎంతవరకు సొంతం చేసుకుంటుంది…బ్రేక్ ఈవెన్ మీద ఎంతవరకు లాభాలను అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.