టాలీవుడ్ లో చిన్న చిన్న సైడ్ రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ కి అక్కడి నుండి కామెడీ రోల్స్ చేస్తూ మెల్లి మెల్లిగా ఎదిగిన నటుల్లో బండ్ల గణేష్ ఒకరు, అలా ఎదిగిన తర్వాత సడెన్ గా నిర్మాతగా మారి కొన్ని బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకున్నా తర్వాత కొంచం స్లో డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలను నిర్మించడానికి సిద్ధం అవుతున్న బండ్ల గణేష్ త్వరలోనే కథ సెట్ అయితే…
పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మించి మళ్ళీ జోష్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇలా ఉండగా మళ్ళీ నటుడుగా కామెడీ రోల్స్ అండ్ సైడ్ రోల్స్ చేయడానికి ఓకే చెప్పిన బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న రోల్ తో మెప్పించాగా రీసెంట్ గా వచ్చిన….
చిన్న సినిమా క్రేజీ అంకుల్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఇలాంటి టైం లో తమిళ్ హిట్ మూవీ ఒకటి తెలుగు లో రీమేక్ చేయబోతున్నారు, పేరు ఏంటి అనేది బయటికి చెప్పలేదు కానీ ఒత్తా సెరుప్పు సైజ్ 7 సినిమా అన్న టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది ఇండస్ట్రీలో. ఈ సినిమాను తెలుగు లో…
బండ్ల గణేష్ ని మెయిన్ లీడ్ గా తీసుకున్నట్లు, అందుకు గాను భారీ రెమ్యునరేషన్ ని కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో మెయిన్ లీడ్ కోసం ఏకంగా 25 లక్షల రెమ్యునరేషన్ ని అలాగే సినిమా సక్సెస్ ను ఓవరాల్ ప్రాఫిట్ ను బట్టి మరో 5 లక్షల దాకా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ రేంజ్ రెమ్యునరేషన్ కాబట్టే హీరోగా అంటే వెంటనే ఓకే చెప్పారట బండ్ల గణేష్, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే జరగబోతుండగా ఈ సినిమా కనుక సక్సెస్ అయితే నటుడిగా కూడా తెలుగు లో మరింత బిజీ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. అటు నిర్మాతగా ఇటు నటుడిగా బండ్ల గణేష్ అప్ కమింగ్ డేస్ లో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.