Home న్యూస్ బందోబస్త్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా ఫట్టా!!

బందోబస్త్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా ఫట్టా!!

1128
0

     కోలివుడ్ స్టార్ హీరో సూర్య కి ఈ మధ్య కాలం లో సరైన హిట్ లేక పోవడం మార్కెట్ చాలా వరకు డల్ అయింది, ఇలాంటి టైం లో తనకి వీడోక్కడే లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కే.వి ఆనంద్ డైరెక్షన్ లో బందోబస్త్ అనే సినిమా చేయగా ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా 1400 కి పైగా థియేటర్స్ భారీ గా రిలీజ్ చేశారు. సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో తమిళ్ లో జరిగాయి.

అక్కడ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభించిందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ ఏజెంట్ అయిన సూర్య శత్రువుల నుండి దేశాన్ని కొందరు కీలక వ్యక్తులను ఎలా కాపాడాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టొరీ పాయింట్ అని అంటున్నారు.

సూర్య ఎప్పటి లానే బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు, ఇక కీలక పాత్రలు చేసిన మోహన్ లాల్ మరియు ఆర్య లు కూడా అద్బుతంగా నటించారని, హీరోయిన్ సయ్యేశా కూడా ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు కూడా మెప్పిస్తాయని అంటున్నారు.

సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం హరీష్ జైరాజ్ అద్బుతంగా ఇచ్చాడని అంటున్నారు. డైరెక్షన్ పరంగా కెవి ఆనంద్ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో మెప్పించినా అది చాలా వరకు కన్ఫ్యూజన్ గా ఉండటం లెంత్ ఎక్కువ అవ్వడం మేజర్ డ్రా బ్యాక్స్ అని అంటున్నారు.

అది తప్పితే సినిమా మొత్తం ఆకట్టుకుందని, సూర్య రీసెంట్ మూవీస్ లో ఇదే బెస్ట్ మూవీ అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది, మొత్తం మీద టాక్ ఎబో యావరేజ్ నుండి హిట్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఇదే టాక్ రెగ్యులర్ షోలకు కూడా కంటిన్యు అయితే సూర్య ఖాతాలో మంచి కంబ్యాక్ హిట్ లభించినట్లే అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here