కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు పై ఆడియన్స్ లో అంచనాలు మెల్లిమెల్లిగా పెరిగిపోతూ ఉండటం విశేషం, పక్కా పండగ మూవీ కావడంతో ఆడియన్స్ లో సినిమా పై సాలిడ్ గానే క్రేజ్ ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను భారీగానే పెంచింది అని చెప్పాలి. ఇక సినిమా…
బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అవ్వగా ఓవరాల్ థియేటర్స్ అగ్రీమెంట్స్ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి, సినిమా కి నైజాంలో కొన్ని హై ఎండ్ మల్టీ ప్లెక్సులలో 290 టికెట్ రేటు ఉండగా మిగిలిన మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్ లో 150 నుండి 200 వరకు టికెట్ రేట్లు పెట్టారు.
ఇక సినిమా గ్రాండ్ గా ఓవర్సీస్ లో అలాగే ఇండియాలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, నాగార్జున కెరీర్ లో కానీ ఇటు నాగ చైతన్య కెరీర్ లో కానీ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతుంది…
అమెరికాలోనే ఈ సినిమా ను ఏకంగా 335 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ప్రస్తుతం అక్కడ వరల్డ్ లోనే రికార్డ్ కేసులు నమోదు అవుతున్న టైం లో. ఇక నైజాంలో సినిమా ఫస్ట్ చార్ట్ లో 200 థియేటర్స్ ని కన్ఫాం చేయగా ఫైనల్ లెక్క ఎంతవరకు వెళుతుంది అన్నది త్వరలో కన్ఫాం కానుంది. ఓవరాల్ గా సినిమా…
బాక్స్ ఆఫీస్ జాతరకి అన్నీ సిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సినిమా దుమ్ము దుమారం లేపే రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సంచలనం సృష్టించే కలెక్షన్స్ ని సంక్రాంతి పండగ టైం లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ జాతర ఎలా ఉంటుందో చూడాలి.