కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా కొంచం పాచ్ వర్క్ బాలెన్స్ ఉండటంతో మరింత ముందు వద్దామనుకున్నా అన్నీ ఆలోచింది 14న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఇక సంక్రాంతి రేసులో ఉన్న…
పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం ప్రస్తుతం సంక్రాంతి కి క్రేజీ మూవీగా బంగార్రాజు ఒక్కటే నిలవబోతుంది. దాంతో సినిమా పై ట్రేడ్ లో సాలిడ్ గా అంచనాలు ఏర్పడగా బిజినెస్ పరంగా కూడా అన్ని ఏరియాల్లో కుమ్మేస్తున్న ఈ సినిమా…
సీడెడ్ ఏరియాలో 5 కోట్ల రేటు మీద GST కలిపి ఏకంగా 6.35 కోట్ల రేంజ్ రేటు కి బిజినెస్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఇది అల్టిమేట్ రేటు ఆఫర్ అని చెప్పాలి. కానీ టీం ఇంకా రేటు ఏది కూడా ఫైనల్ చేయలేదని, ఇంకా బెటర్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. పండక్కి ఈ ఒక్క మూవీనే ఫ్యామిలీస్ లో కూడా క్రేజ్ ఉన్న మూవీ కాబట్టి బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.