కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో 2016 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాగార్జున వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ లో టైం లో ఉన్నప్పటికీ సోగ్గాడే అల్టిమేట్ హిట్ అవ్వడం ఆ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ అవ్వడంతో బజ్ అదిరిపోయింది.
ఇక అదే టైం లో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతుండగా హాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి బరిలో ఇది వరకు ఆర్ ఆర్ ఆర్ మరియు….
రాధే శ్యామ్ లు కన్ఫాం అవ్వగా… అవి పాన్ ఇండియా మూవీస్ అవ్వడం వలన వాటి ఆఫర్స్ తో పోల్చితే బంగార్రాజుకి తక్కువ ఆఫర్స్ వచ్చాయి, కానీ ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అవ్వడంతో సీన్ మొత్తం మారిపోగా రాధే శ్యామ్ కూడా ఇతర రాష్ట్రాలలో చివరి నిమిషం వరకు ఉన్న పరిస్థితుల తోనే…
రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ రానుండగా ఉన్నంతలో సంక్రాంతి సీజన్ లో బయర్స్ కి, హైర్స్, మినిమమ్ గ్యారెంటీ డబ్బులు పెట్టి కొనే వాళ్ళకి బంగార్రాజు హాట్ కేక్ లా కనిపిస్తుంది ఇప్పుడు, దాంతో ముందు అనుకున్న ఆఫర్స్ కి మించి సినిమా బిజినెస్ జరుగుతుందట, ఆంధ్రలో 18 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తుండగా, సీడెడ్ లో 5 కోట్ల రేంజ్ లో ఆఫర్స్…
వస్తున్నాయట. ఇక నైజాం లో 8-10 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తూ ఉండగా ఇవి కలిపే టోటల్ గా 32-34 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు, కానీ అదే టైం లో మేకర్స్ కూడా కొన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి సీజన్, ఏమాత్రం టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ తో బంగార్రాజు మాస్ కలెక్షన్స్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.