కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తీ చేసుకోగా సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా పోటిలో భారీ సినిమాలు ఉన్న కారణంగా సినిమా…
సంక్రాంతికి వస్తుందా లేదా అన్న అనుమానాలు ఉండగా ఇతర రాష్ట్రాల్లో, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా బంగార్రాజు సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేసి సినిమా…
సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతుందని అఫీషియల్ గా కన్ఫాం చేశారు. ఇక టీసర్ చూస్తుంటే సోగ్గాడే చిన్నినాయనకి ఏమాత్రం తీసిపోని విధంగా మెప్పించేలా ఉందని చెప్పాలి. నాగ చైతన్య బంగార్రాజుగా కనిపిస్తున్న ఈ సినిమాలో మనవడిని చూసుకోవడానికి మళ్ళీ భూమి మీదకు వచ్చే ఒరిజినల్ బంగార్రాజుగా కింగ్ నాగార్జున కనిపిస్తూ ఉండగా…
పల్లెటూరి నేపద్యంలో ఫుల్ మాస్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా, సంక్రాంతి పండక్కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్టొరీతో వస్తున్న బంగార్రాజు టీసర్ చూసిన తర్వాత సోగ్గాడే చిన్నినాయన మ్యాజిక్ రీ క్రియేట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండనిపిస్తూ ఉండగా ఈ సారి సంక్రాంతికి బంగార్రాజు జాక్ పాట్ కొట్టినట్లే అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో టీసర్ ఇంప్రెస్ చేసింది.
నాగ చైతన్య అసలే వరుస హిట్స్ తో హాట్రిక్ ని పూర్తీ చేసుకోగా ఈ సినిమా తో మరింత రాంపేజ్ ని చూపెట్టే అవకాశం ఎంతైనా ఉంది, సంక్రాంతికి అని కన్ఫాం చేసినా డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు టీం. మరి ఏ డేట్ కి సినిమా వస్తుందో బాక్స్ ఆఫీస్ ను సినిమా ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. ఇక టీసర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.