కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా కి అన్ని ఏరియాలలో కూడా బిజినెస్ ఆఫర్స్ కూడా అదిరి పోయే రేంజ్ లో వస్తూ ఉండగా సినిమా బిజినెస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ఈ సారికి సంక్రాంతి సీజన్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
ఇక బంగార్రాజుతో పాటు ఇతర సినిమాలు కూడా పోటిలో ఉండగా నైజాం ఏరియాలో ఫస్ట్ థియేటర్స్ కౌంట్ ని రిలీజ్ చేయగా మిగిలిన సినిమాలలో రౌడీ బాయ్స్ కి ఎక్కువ థియేటర్స్ ఉండగా బంగార్రాజు కి మాత్రం ఇనీషియల్ థియేటర్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంది….
దానికి కారణం నైజాంలో సినిమా కి ఫైనల్ అగ్రిమెంట్స్, టికెట్ హైక్స్ లాంటివి ఇంకా పెండింగ్ లో ఉండటం వలనే థియేటర్స్ కౌంట్ ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయని, త్వరలోనే ఫైనల్ కౌంట్ నైజాంలో భారీగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఆ కౌంట్ ఎంతవరకు ఉంటుంది అనేది కొన్ని రోజుల్లో తేలబోతుంది అని చెప్పొచ్చు.