కింగ్ నాగార్జున మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతూ ఉండగా ముందు నుండి సంక్రాంతికి అనుకున్న ఈ సినిమా రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ చేసిన టీసర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గానే ఉన్నా కానీ ఓవరాల్ గా 24 గంటల రిపోర్ట్ మాత్రం…
కొద్దిగా నిరాశ పరిచే విధంగానే ఉందని చెప్పాలి. కానీ కొంచం లేట్ గా రిలీజ్ చేయడం, న్యూ ఇయర్ టైం లో రిలీజ్ అవ్వడం లాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టగా ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 2.7 మిలియన్ వ్యూస్ ని అలాగే 169.9K లైక్స్ ని…
సొంతం చేసుకుని ఓవరాల్ గా పర్వాలేదు అనిపించింది కానీ సినిమా పై ఏర్పడిన బజ్ కి ఇంకా బెటర్ రిజల్ట్ రావాల్సింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి మాత్రం సాలిడ్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే అవకాశం ఉండగా టాక్ పాజిటివ్ గా ఉంటే రచ్చ మరో లెవల్ లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పాలి.