ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు అంటే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండేది, సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ కలెక్షన్స్ మాత్రం మినిమమ్ గ్యారెంటీ లెవల్ లో ఉంటూ వచ్చేవి, కానీ సుడిగాడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లరి నరేష్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ వస్తుండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ మొత్తం కోల్పోతూ వస్తున్నాడు. ఇలాంటి టైం లో ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వలేక పోయిన అల్లరోడు మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా బంగారు బుల్లోడు సినిమాతో రాగా ఈ సినిమా కి యావరేజ్ రేంజ్ టాక్ లభించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినా…
లాంగ్ రన్ లో తేలిపోయిన సినిమా వర్కింగ్ డేస్ లో ఏమాత్రం కలెక్షన్స్ ని సాధించలేక పరుగును అతి కష్టంగా కొనసాగిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న సినిమా 8 వ రోజు కూడా ఏమంత ఆశాజనకమైన కలెక్షన్స్ ని అయితే సాధించలేక పోయింది.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర బంగారు బుల్లోడు సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 50L
👉Ceeded: 28L
👉UA: 24L
👉East: 15L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 12L
👉Nellore: 8L
AP-TG Total:- 1.63CR (2.31Cr Gross~)
KA+ROI: 5L
OS: 3L
Total:- 1.71Cr(2.74Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను టోటల్ గా 3.2 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
ఇప్పుడు మొత్తం మీద 8 రోజులు పూర్తీ అయ్యాక సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.79 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది అసాధ్యం కాబట్టి డిసాస్టర్ రిజల్ట్ తో సినిమా పరుగును ముగించబోతుంది, ఇక రెండో వీకెండ్ లో ఆదివారం ఉండటం తర్వాత సినిమా సినిమా ఏమైనా జోరు చూపితే ఎంతో కొంత నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంది.