బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ హాలిడే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) డైరెక్ట్ చేసిన సినిమా బరోజ్3D(Barroz3D Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ భారీగా వచ్చేసింది. అటు మలయాళంలోనే కాకుండా….
తెలుగులో కూడా సినిమాకి భారీ లెవల్ లో మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…ఇక సినిమాకి పోటిగా ఇతర సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన ఓపెనింగ్స్ పెద్దగా ఏమి జోరు చూపించ లేక పోయింది సినిమా…
మొదటి రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 30 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. షేర్ మొత్తం మీద 15 లక్షల లోపే ఉంటుందని అంచనా…తెలుగు డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఆ లెక్కన సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కేరళలో మాత్రం మొదటి రోజు సినిమా 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా టోటల్ గా ఇండియాలో 4 కోట్ల లోపే గ్రాస్ ను అందుకుందని అంచనా…ఓవర్సీస్ లో కూడా పెద్దగా…
ఇంపాక్ట్ చూపించ లేక పోయిన వరల్డ్ వైడ్ గా సినిమా 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంచనా…సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ డీటైల్స్ లాంటివి ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉండగా మొత్తం మీద నిరాశ పరిచే స్టార్ట్ ను…
సొంతం చేసుకున్న బరోజ్3D సినిమా డైరెక్టర్ గా మోహన్ లాల్ కి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. లాంగ్ వీకెండ్ లో సినిమా ఏమైనా హోల్డ్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.